ఛీ.. ఛీ.. ఎంత నీచం.. 11 ఏళ్ల చిన్నారికి అలాంటి వీడియో మెసేజ్‌లు..!

ABN , First Publish Date - 2021-08-21T12:30:48+05:30 IST

కోపం, పగ, అహంకారం మనుషుల్లో మానవత్వాన్ని దెబ్బతీస్తాయి. మంచి, చెడుల తారతమ్యం మరచిపోయేలా చేస్తాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు..

ఛీ.. ఛీ.. ఎంత నీచం.. 11 ఏళ్ల చిన్నారికి అలాంటి వీడియో మెసేజ్‌లు..!

గ్వాలియర్: కోపం, పగ, అహంకారం మనుషుల్లో మానవత్వాన్ని దెబ్బతీస్తాయి. మంచి, చెడుల తారతమ్యం మరచిపోయేలా చేస్తాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారుస్తాయి. తాజాగా ఇలాంటి నీచమైన పనికే ఓ మహిళ పూనుకుంది. 11 ఏళ్ల చిన్నారి పాపకు అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు, మెసేస్‌లు పంపుతూ పీడించసాగింది. చిన్నారి వారించినా ఆమె అలాంటి మెసేజ్‌లు పంపుతూనే ఉంది. విషయం ఆ చిన్నారి తల్లికి తెలియడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం, ఐటీ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానిక జనక్‌గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 


బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. జనక్‌గంజ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వారు నివశిస్తున్నారు. అయితే కొంతకాలంగా 11ఏళ్ల తమ కూతురు మొబైల్‌ ఫోన్‌కు భోపాల్‌లో నిశించే నేహా బరేలియా పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ నుంచి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు, కథలూ వస్తున్నాయి. చాలా సార్లు ఆమెతో ఈ విషయంలో మాట్లాడి పంపవద్దని వారించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా ఈ వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌లతో చిన్నారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే చిన్నారి తండ్రితో నేహా అనే మహిళకు ఏదో వివాదం ఉందని, దానికి ప్రతీకారంగానే ఆమె ఇంత నీచానికి దిగజారిందని బాధితురాలి తల్లి పేర్కొన్నారు.


కాగా.. స్టేషన్ ప్రధాన అధికారి సంజీవ్ నయన్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. నేహా అనే మహిళ మొదట చిన్నారి తల్లికి కూడా ఇలాంటి మెసేజ్‌లు పంపించింది. అయితే ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో నేహా.. చిన్నారికి పంపడం మొదలుపెట్టింది. ప్రస్తుతం నిందితురాలిపై కేసు నమోదు చేశామని, ఆమెను పట్టుకునేందుకు భోపాల్‌కు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్లు వెల్లడించారు.


Updated Date - 2021-08-21T12:30:48+05:30 IST