నడిచే లగ్జరీ బస్సులో మహిళపై రెండు సార్లు క్లీనర్ అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-01-12T13:58:20+05:30 IST

నడిచే లగ్జరీ బస్సులో ఓ మహిళపై క్లీనరు రెండు సార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది....

నడిచే లగ్జరీ బస్సులో మహిళపై రెండు సార్లు క్లీనర్ అఘాయిత్యం

మహారాష్ట్రలో దారుణం 

వాషిం (మహారాష్ట్ర):నడిచే లగ్జరీ బస్సులో ఓ మహిళపై క్లీనరు రెండు సార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వాషిం జిల్లా మాలేగాం నుంచి నాగపూర్ నగరానికి వస్తున్న లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళను బెదిరించి బస్సు క్లీనరు రెండు సార్లు అత్యాచారం చేశాడు. నడుస్తున్న బస్సులోనే బెదిరించి తనపై క్లీనరు రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచార ఘటన నడిచే బస్సులో జరగడంతో కేసు నమోదు చేసిన రంజన్ గాం పోలీసులు దీన్ని వాషిం జిల్లాకు బదిలీ చేశారు. బస్సు క్లీనరుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-12T13:58:20+05:30 IST