ఆయాపై అనుమానంతో సీసీటీవీ కెమెరాలో చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు!

ABN , First Publish Date - 2021-10-03T14:22:40+05:30 IST

పుట్టిన చిన్నారిని..

ఆయాపై అనుమానంతో సీసీటీవీ కెమెరాలో చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు!

ఇంటర్‌నెట్‌డెస్క్: పుట్టిన చిన్నారిని చూసుకోవడం కోసం ఓ ఆయను నియమించి.. దంపతులు ఇద్దరూ ఉద్యోగం నిమిత్తం ఆఫీసులకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చాకా ప్రతిరోజూ పాపాలో ఏదో మార్పు గమనించడం మొదలుపెట్టారు. ఆయాపై అనుమానం కలిగి సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. ఆఫీసుకు వెళ్లాకా ఇంట్లో ఏం జరుగుతుందోనని సీసీటీవీ ఫుటేజీని చూడగా తల్లిదండ్రులకు షాకింగ్ దృశ్యాలు కనపడ్డాయి. పదినెలల చిన్నారిపై ఆయా దారుణానికి పాల్పడడం చూసి విలవిలలాడిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే..


పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల చిన్నారి ఉంది. చిన్నారిని చూసుకోవడం కోసం ఓ ఆయను నియమించుకున్నారు. మొదట్లో ఆయా చిన్నారిని బాగానే చూసుకునేది. కానీ కొన్ని రోజుల తర్వాత చిన్నారిలో ఏదో భయం గమనించిన తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆయాకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టించారు. ఓ రోజు ఆఫీసుకు వెళ్లాకా ఇంట్లో ఏం జరుగుతుందోనని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా తల్లిదండ్రులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.పదినెలల చిన్నారిపై ఆయా ఏమాత్రం కనికరం లేకుండా చితకబాదడం చూసి భయపడ్డారు. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆయా చిన్నారిని కొడుతుండడం చూసి తల్లిదండ్రుల ఫ్రాణం పోయినట్లైంది. వెంటనే ఇంటికి బయలుదేరారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చి ఆయాను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చిన్నారిని అంతలా కొట్టడానికి కారణాలేంటో తెలియరాలేదు. 

Updated Date - 2021-10-03T14:22:40+05:30 IST