మద్యం మత్తులో వలంటీరు వీరంగం

ABN , First Publish Date - 2021-01-03T09:27:06+05:30 IST

‘నేను తలచుకుంటే ఏమైనా చేయగలను, పింఛన్లు రద్దు చేస్తా, పథకాలు రాకుండా అడ్డుకుంటా’...

మద్యం మత్తులో వలంటీరు వీరంగం

మెంటాడ, డిసెంబరు 2: ‘నేను తలచుకుంటే ఏమైనా చేయగలను, పింఛన్లు రద్దు చేస్తా, పథకాలు రాకుండా అడ్డుకుంటా’... అంటూ మద్యం మత్తులో... కనిపించిన వారిపై తిట్ల దండాకిని దిగాడు విజయనగరం జిల్లా మెంటాడ మండలం తమ్మిరాజుపేటకు చెందిన వలంటీరు పాసల సతీ్‌షకుమార్‌(భద్రాచలం). పూటుగా మద్యం తాగా శుక్రవారం రాత్రి గ్రామంలో వీరంగం సృష్టించాడు. వారించిన స్థానిక మహిళలపై ఇనుప చువ్వతో దాడికి పాల్పడ్డాడు. దీంతో కొరిపిల్లి పైడమ్మ, పైల రమణమ్మ, కొరిపల్లి సుమలత గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ తెలిపారు.

Updated Date - 2021-01-03T09:27:06+05:30 IST