నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

ABN , First Publish Date - 2021-01-20T09:33:10+05:30 IST

వారంతా వలస కార్మికులు. పడుకోవడానికి కూడా చోటు లేదు. దీంతో రోడ్డు పక్కనే నిద్రించారు. 18 మంది నిద్రలో ఉండగా మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఓ డంపర్‌ ట్రక్కు వారిపై నుంచి వెళ్లింది.

నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

15 మంది దుర్మరణం.. ముగ్గురికి గాయాలు


సూరత్‌: వారంతా వలస కార్మికులు. పడుకోవడానికి కూడా చోటు లేదు. దీంతో రోడ్డు పక్కనే నిద్రించారు. 18 మంది నిద్రలో ఉండగా మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఓ డంపర్‌ ట్రక్కు వారిపై నుంచి వెళ్లింది. దీంతో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ పాప (1) కూడా ఉంది. అలాగే, ఆరు నెలల వయసున్న ప్రియాంక అనే మరో పాప ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగా, ఆమె తల్లిదండ్రులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గుజరాత్‌లోని సూరత్‌  జిల్లా కసంబ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతి చెందిన వలస కార్మికుల్లో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడని, మిగతా వారంతా రాజస్థాన్‌లోని బాన్స్‌వాడా జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. గాయాలపాలైన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు. మృతుల కుటుంబాలకు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ కూడా రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

Updated Date - 2021-01-20T09:33:10+05:30 IST