ట్రైన్ రాగానే నేను చచ్చిపోతా.. నా దగ్గర రూ.లక్ష కొట్టేసిన ఆమెను వదలొద్దు.. రైలు పట్టాలపై పడుకుని యువకుడి వీడియో రికార్డింగ్.. చివరకు..

ABN , First Publish Date - 2021-11-23T14:51:58+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఒక యువకుడు రైలు కిందపడి..

ట్రైన్ రాగానే నేను చచ్చిపోతా.. నా దగ్గర రూ.లక్ష కొట్టేసిన ఆమెను వదలొద్దు.. రైలు పట్టాలపై పడుకుని యువకుడి వీడియో రికార్డింగ్.. చివరకు..

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక యువతి ఈ యువకుడిని ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కలత చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే దీనికి ముందు ఆ యువకుడు రైలు పట్టాలపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ, ఒక వీడియో రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లలిత్‌పూర్- బీనా మార్గంలోని రైలు పట్టాలపై ఒక యువకుని మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడిని కక్రువా గ్రామానికి చెందిన దేవేంద్ర(30)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 


ఈ సందర్భంగా మృతుని సోదరుడు ఇంద్రపాల్ మాట్లాడుతూ తన సోదరుడు పనారీ గ్రామంలో ఉంటూ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడన్నారు. కొంతకాలం క్రితం తన సోదరుడి వద్ద నుంచి లక్ష రూపాయల సొమ్మును ఒక యువతి తీసుకున్నదన్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తన సోదరుడిని ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించారు. కాగా దేవేంద్ర తాను ఆత్మహత్య చేసుకునేముందు రికార్డు చేసిన వీడియోలో ‘జైన్ మందిరం సమీపంలో ఒక మహిళ పనిచేస్తున్నది, ఒక యువకుడు కూడా ఆమెతో పాటు ఉంటున్నాడని, తన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ యువతి మోసం చేసిందని, దీనిని తట్టుకోలేకనే తాను రైలు పట్టాలపై కూర్చున్నానని, రైలు రాగానే ఆత్మహత్య చేసుకుంటానని, ఆమెను వదిలిపెట్టవద్దని’ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-23T14:51:58+05:30 IST