పెళ్లాం వదిలేసిందనే కోపంతో.. ఏకంగా bomb తయారు చేశాడు.. చివరకు..!

ABN , First Publish Date - 2021-10-07T00:47:22+05:30 IST

చెన్నై మిజోరాంలోని లుంగ్లీ ప్రాంతంలో రోహ్మింగ్లియానా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో తంతియాంఘ్లిమి అనే మహిళ తన కుమార్తెతో కలిసి జీవిస్తోంది. అప్పటికే ఆమె మొదటి భర్తను వదిలేసింది. ఈ క్రమంలో రోహ్మింగ్లియానాతో పరిచయం ఏర్పడింది.

పెళ్లాం వదిలేసిందనే కోపంతో.. ఏకంగా bomb తయారు చేశాడు.. చివరకు..!

చిన్నచిన్న తప్పుల కారణంగా కొన్నిసార్లు పచ్చని సంసారాలు.. ఛిన్నాభిన్నమవుతుంటాయి. చెన్నైలో కూతురు ఉన్న ఓ మహిళ.. తన భర్తను వదిలేసింది. తర్వాత కొన్ని నెలలకు ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు వారి జీవితం బాగానే సాగింది. అయితే రానురాను గొడవలు మొదలయ్యాయి. దీంతో మళ్లీ రెండో భర్తను కూడా వదిలేసింది. కూతురుతో కలిసి సొంతంగా జీవిస్తోంది. ఈమె ప్రవర్తన.. రెండో భర్తకు నచ్చలేదు. చాలా రోజులు ఆలోచించి ఓ నిర్ణయానికి. జిలెటిన్ స్టిక్స్‌తో ఓ బాంబును తయారు చేశాడు. వివరాల్లోకి వెళితే.. 


చెన్నై మిజోరాంలోని లుంగ్లీ ప్రాంతంలో రోహ్మింగ్లియానా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో తంతియాంఘ్లిమి అనే మహిళ తన కుమార్తెతో కలిసి జీవిస్తోంది. అప్పటికే ఆమె మొదటి భర్తను వదిలేసింది. ఈ క్రమంలో రోహ్మింగ్లియానాతో పరిచయం ఏర్పడింది.  కొన్నాళ్లకు ఇద్దరూ వివాహం చేసుకుని ఒకే ఇంట్లో సంసారం పెట్టారు. కొన్నాళ్లు వారి జీవితం బాగానే సాగింది. తర్వాత వారి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. చివరకు ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఆ మహిళ.. కుమార్తెతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటోంది. 


ఆమె మీద కోపం పెంచుకున్న రెండో భర్త.. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఏడాది అనంతరం చివరకు ఎవరూ ఊహించని విధంగా ఓ బాంబునే తయారు చేశాడు. అనంతరం దాన్ని జేబులో పెట్టుకుని మంగళవారం ఆ మహిళ వద్దకు వెళ్లాడు. చాలా రోజుల తర్వాత కనిపించడంతో ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. కోపంతో రగిలిపోతున్న అతను.. ఒక్కసారిగా సిగరెట్ వెలిగించి.. అనంతరం బాంబ్‌కు అంటించాడు. తర్వాత ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. బాంబు పేలుడుకు ఇద్దరూ ముక్కలుముక్కలు అయ్యారు. అయితే అదృష్టవశాత్తు.. మహిళ కుమార్తె మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-10-07T00:47:22+05:30 IST