కొడుకును చంపిన తండ్రికి ఏడేళ్ల జైలు

ABN , First Publish Date - 2021-01-13T12:00:00+05:30 IST

నేరేడ్‌మెట్‌ కృపా కాంప్లెక్స్‌ దగ్గరలోని కృష్ణానగర్‌లో

కొడుకును చంపిన తండ్రికి ఏడేళ్ల జైలు

హైదరాబాద్/నేరేడ్‌మెట్‌ : కొడుకును చంపిన తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. నేరేడ్‌మెట్‌ సీఐ నరసింహస్వామి కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్‌ కృపా కాంప్లెక్స్‌ దగ్గరలోని కృష్ణానగర్‌లో నివాసముండే పగడాల మహేందర్‌నాయుడు (28) గ్యాస్‌ డెలివరీ బాయ్‌. అతను పని మానేసి రోజూ మద్యం మత్తులో తల్లిదండ్రులు పగడాల మోహనరావునాయుడు(68), ఉషారాణిలతో రోజూ గొడవపడి వేధించేవాడు. 2018 అక్టోబర్‌ 13న మహేందర్‌నాయుడు తన స్నేహితుడు కృష్ణమరాజుతో కలిసి మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండ్రి  కూరగాయలు కోసే కత్తితో మహేందర్‌నాయుడు ఛాతీలో పొడిచాడు. దీంతో మహేందర్‌నాయుడు అక్కడే కుప్పకూలి చనిపోయాడు. 


నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు మల్కాజిగిరి మెట్రోపాలిటన్‌ 16వ అదనపు జడ్జి కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. జడ్జి భవానీచంద్ర కేసును విచారించగా నేరం రుజువు కావడంతో నిందితుడి మనోహర్‌ నాయుడుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 600 జరిమానా విధించారు. కాగా, హత్య కేసులో రెండేళ్లలోనే శిక్ష పడేలా చేసిన అడిషనల్‌ పీపీ గంగారెడ్డి, సీఐ నరసింహస్వామి, సీడీఓ పరశురాములును రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి సన్మానించారు.

Updated Date - 2021-01-13T12:00:00+05:30 IST