నాడు ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ పేరుతో టోపీ! నేడు ఏకంగా...

ABN , First Publish Date - 2021-01-12T21:10:23+05:30 IST

మీకు ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ గుర్తుందా...? అదేనండి.. 251 రూపాయల ఫోన్! అప్పట్లో తెగ హల్ చల్ చేసింది! అనేక మంది దీనికి ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి చేతులు కాల్చుకున్నారు కూడా.. రింగింగ్ బెల్స్ కంపెనీ.. మైండ్ గంట మోగింది కదూ..! సదరు కంపెనీ సీఈఓ మోహిత్ గోయల్ మరోసారి వార్తల్లో కెక్కాడు.

నాడు ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ పేరుతో టోపీ! నేడు ఏకంగా...

నోయిడా: మీకు ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ గుర్తుందా...? అదేనండి.. 251 రూపాయల ఫోన్! అప్పట్లో తెగ హల్ చల్ చేసింది! అనేక మంది దీనికి ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి చేతులు కాల్చుకున్నారు కూడా.. రింగింగ్ బెల్స్ కంపెనీ.. మైండ్‌లో గంట మోగింది కదూ..! సదరు కంపెనీ సీఈఓ మోహిత్ గోయల్ మరోసారి వార్తల్లో కెక్కాడు. ఈ మారు రూ. 200 కోట్ల మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులు చేతికి చిక్కాడు. దుబాయ్ కేంద్రంగా డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ హబ్ పేరిట ఓ కంపెనీని పెట్టి వ్యాపారులకు ఏకంగా 200 కోట్ల మేర టోపి పెట్టాడనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. మరో ఐదుగురితో కలసి గోయల్ ఈ సంస్థను నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నోయిడాలోని మేఘదూతం పార్క్ సమీపంలో పోలీసులు గోయల్‌ను అరెస్టు చేశారు. ఈ మోసంలో ఆయన పాత్ర ఎంతో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-01-12T21:10:23+05:30 IST