మహిళపై అత్యాచారం చేసి, రూ.15లక్షల నగల దోపిడీ
ABN , First Publish Date - 2021-07-08T17:22:39+05:30 IST
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం చేసి, రూ.15లక్షల నగదు, నగలను దోపిడీ చేసిన ముగ్గురు దొంగల దురాగతం...

కోల్కతాలో దొంగల దురాగతం
కోల్కతా (పశ్చిమబెంగాల్): ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం చేసి, రూ.15లక్షల నగదు, నగలను దోపిడీ చేసిన ముగ్గురు దొంగల దురాగతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో జరిగింది. కోల్కతాలో తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లడంతో 26 ఏళ్ల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ముగ్గురు గుర్తుతెలియని దొంగలు బుధవారం మధ్యాహ్నం ఇంట్లోకి ప్రవేశించి మహిళను పడకగదిలో తాడుతో బంధించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.అనంతరం ఇంట్లోని అల్మారాలో దాచి ఉంచిన రూ.15లక్షల నగదు, నగలను దోచుకొని పారిపోయారు. అనంతరం ప్రాణాలతో బయటపడిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 450,455, 34,394,376 డి ల కింద కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.