రోడ్డు ప్రమాదంలో సైనికుడి మృతి
ABN , First Publish Date - 2021-10-28T12:53:49+05:30 IST
రోడ్డుప్రమాదంలో ఓ సైనికుడు మృతిచెందాడు. రాణిపేట జిల్లా భానావరం సమీపం పుదుప్పేటకు చెందిన పళని (56) కుమా రుడు అజిత్‌కుమార్ (26) కశ్మీర్ సైనికదళంలో పనిచేస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అజిత్ నెలరోజుల

వేలూరు(Chennai): రోడ్డుప్రమాదంలో ఓ సైనికుడు మృతిచెందాడు. రాణిపేట జిల్లా భానావరం సమీపం పుదుప్పేటకు చెందిన పళని (56) కుమా రుడు అజిత్‌కుమార్ (26) కశ్మీర్ సైనికదళంలో పనిచేస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అజిత్ నెలరోజుల సెలవుపై ఈ నెల 20వ తేదీ స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం పులివల్లమ్‌లోని బంధువుల ఇంటికి వెళ్ళిన అజిత్ రాత్రి 10 గంటలకు ద్విచక్రవాహనంపై ఇంటి కి బయల్దేరాడు. మధ్యలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అజిత్ సంఘటనా స్థలంలో మృతిచెందాడు.