అద్దెకు తీసుకున్న ద్విచక్రవాహనం చోరీ

ABN , First Publish Date - 2021-02-26T13:49:06+05:30 IST

అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడో వ్యక్తి.

అద్దెకు తీసుకున్న ద్విచక్రవాహనం చోరీ

హైదరాబాద్/పంజాగుట్ట : అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడో వ్యక్తి. రెంటల్‌ ఏజెన్సీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పంజాగుట్టకు చెందిన పి.సురేష్‌ పీఎస్‌ బ్రదర్స్‌ పేరుతో ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇస్తున్నాడు. ఈనెల 21న మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌కు చెందిన రణ్‌వీర్‌ ధాకడ్‌ ఆర్‌15వీ3 (టీఎస్11ఈఆర్‌4068)ద్విచక్రవాహనాన్ని రోజుకు రూ. 1,500 చొప్పున, రెండు రోజుల కోసం అద్దెకు తీసుకున్నాడు. కానీ తిరిగి ఇవ్వలేదు. వాహనం తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. దీంతో నిర్వాహకుడు సురేష్‌ గురువారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-26T13:49:06+05:30 IST