మద్యం తాగి కారుతో ఢీకొట్టిన పోలీసు అధికారి...సస్పెన్షన్

ABN , First Publish Date - 2021-12-07T18:26:35+05:30 IST

ఓ పోలీసు అధికారి యూనిఫాంలోనే పీకలదాకా మద్యం తాగి,మత్తులోనే కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఘటన...

మద్యం తాగి కారుతో ఢీకొట్టిన పోలీసు అధికారి...సస్పెన్షన్

భోపాల్ : ఓ పోలీసు అధికారి యూనిఫాంలోనే పీకలదాకా మద్యం తాగి,మత్తులోనే కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండ్వా జిల్లాలో వెలుగుచూసింది. పంధానా పోలీసు స్టేషన్ పోలీసు అధికారి అంతిమ్ పవార్ ఖర్గోనీ జిల్లా భికంగన్ పట్టణంలో పీకల దాకా మద్యం తాగి కారు నడిపాడు. మద్యం మత్తులో జోగుతున్న పోలీసు అధికారి అంతిమ్ పవార్ కారు నడుపుతూ ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు వచ్చి నిందితుడైన ఖాకీని పట్టుకున్నారు.ఈ ఘటనపై ఆగ్రహించిన ఖండ్వా జిల్లా ఎస్పీ మందుబాబు అయిన అంతిమ్ పవార్ ను సస్పెండ్ చేశారు.పోలీసుల విచారణలో అంతిమ్ పవార్ మద్యం తాగినట్లు తేలింది. ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదు మేర పోలీసులు అంతిమ్ పవార్ పై ఐపీసీ సెక్షన్ 279, 337 ల కింద కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-12-07T18:26:35+05:30 IST