తల్లితో సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

ABN , First Publish Date - 2021-02-05T12:03:32+05:30 IST

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది.

తల్లితో సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

హైదరాబాద్/పహాడిషరీఫ్‌ : ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది.  పహాడిషరీఫ్‌ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాం కాలనీకి చెం దిన పి.వెంకటేష్‌, పద్మ భార్యభర్తలు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. వెంకటేష్‌ రోజూ ఉదయం 8గంటలకు పనికి వెళ్లి సాయం త్రం 7గంటలకు తిరిగి వస్తాడు. బుధవారం సాయంత్రం 7గంటలకు వచ్చిన వెంకటేష్‌ ఇంట్లో భార్య పద్మ(28), వర్షిత(5),అక్షయ్‌(3) కనపడలేదు. బస్తీ పరిసరాల్లో, పద్మ పుట్టింటి వద్ద, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పహాడిషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-02-05T12:03:32+05:30 IST