స్కూటీపై వెళ్లే యువతులు, మహిళలే టార్గెట్.. మొబైల్స్, ల్యాప్‌టాప్స్ హాంఫట్

ABN , First Publish Date - 2021-08-21T12:01:11+05:30 IST

మహిళలే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దొంగలు. అమ్మాయిలైతే వెనకపడలేరనే ధైర్యంతో వాళ్లే టార్గెట్‌గా ఈ దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. తాజాగా ఇలాంటి దొంగల ముఠానే..

స్కూటీపై వెళ్లే యువతులు, మహిళలే టార్గెట్.. మొబైల్స్, ల్యాప్‌టాప్స్ హాంఫట్

అమ్మాయిలూ.. స్కూటీపై వెళ్లేటప్పుడు మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ముఖ్యంగా మీ బ్యాగ్‌లు జాగ్రత్త. ల్యాప్‌ల్యాప్‌లు బ్యాగ్‌లో పెట్టుకుని స్కూటీపై ఉంచి లేదా వెనుక తగిలించుకుని వెళ్లే యువతులు, మహిళలే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దొంగలు. అమ్మాయిలైతే వెనకపడలేరనే ధైర్యంతో వాళ్లే టార్గెట్‌గా ఈ దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. తాజాగా ఇలాంటి దొంగల ముఠానే జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.


స్కూటీపై వెళ్లే యువతులు, మహిళలే టార్గెట్‌గా మొబైల్స్, లాప్‌టాప్‌లు దోచుకునే ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు నగరం మొత్తం గాలింపు మొదలు పెట్టారు. దాదాపు 300 పవర్ బైక్‌లను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. వారితో పాటు దాదాపు వారి నుంచి తక్కువ ధరలకు ఈ దొంగ సొమ్మును కొనుగోలు చేసే ఓ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి దాదాపు 15 ల్యాప్‌ట్యాప్‌లను, ఓ లగ్జరీ పవర్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


దీనిపై డీసీపీ దిగంత్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 6 నెలలుగా అనేక ప్రాంతాల్లో దాదాపు 24 ల్యాప్‌ట్యాప్‌లు చోరీ చేశారు. ప్రధానంగా స్కూటీలపై తిరిగే యువతులు, మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. ముందుగా స్కూటీపై వెళుతున్న వారి నుంచి ల్యాప్‌ట్యాప్ బ్యాగ్ లాగేసుకుంటారు. ఆ బ్యాగ్‌లో ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్లను తీసుకుని, అందులోని మిగిలిన కాగితాలను చెత్త కుప్పలో పడేసేవారు. దొంగతనానికి గురైనా మహిళలు వెంటపడరని, అందుకే వారినే టార్గెట్ చేసుకున్నామని నిందితులు చెప్పినట్లు ఆయన తెలిపారు.


నిందితుల్లో టూటీ పులియా సమీపంలో నివశించే సాంగానేర్ జయపూర్‌కు చెందిన  సయ్యద్ హబీబ్ హుసేన్ అలియాజ్ ఆగాజ్ అలాయాజ్ నిక్ ఆగాజ్(23), సాంగానేర్‌కే చెందిన మోహమ్మద్ కైఫ్ అలియాజ్ హనీ అలియాజ్ రేహాన్(53) ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇక వీరి నుంచి దొంగ సొత్తును కొనుగోలు చేసే బగరూ ప్రాంతంలోని ఝుండ్ గ్రామానికి చెందిన హిమ్మత్ సింహ్ అలాయాజ్ నరేశ్(23)ను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇప్పటికే నిందితులు తాము దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ప్రస్తుతం రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నట్లు డీసీపీ ఆనంద్ వెల్లడించారు.


Updated Date - 2021-08-21T12:01:11+05:30 IST