జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో మరో దారుణం

ABN , First Publish Date - 2021-07-08T21:27:32+05:30 IST

జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దమ్మాయిగూడలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. చిన్నారి పరిస్థితి విషమంగా

జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో మరో దారుణం

హైదరాబాద్‌: జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దమ్మాయిగూడలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయాన్ని బయటపెట్టనివ్వకుండా బంధువులపై పోలీసుల ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   


ఈ నెలలోనే ఇద్దరు పిల్లలు అత్యాచారానికి గురికావడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే నిందితులను పట్టుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-07-08T21:27:32+05:30 IST