incometax అధికారినంటూ మోసం
ABN , First Publish Date - 2021-10-21T12:54:07+05:30 IST
రాణిపేట సమీపంలోని ఆర్కాడుకు చెందిన పారిశ్రామికవేత్త వద్ద ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా నటించి రూ.6 లక్షల మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గూండా చట్టం కింద అరెస్టు చేశారు. ఆర్కాడుకు చెందిన పారిశ్రామికవేత్త కన్నన్

వేలూరు(chennai): రాణిపేట సమీపంలోని ఆర్కాడుకు చెందిన పారిశ్రామికవేత్త వద్ద ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా నటించి రూ.6 లక్షల మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గూండా చట్టం కింద అరెస్టు చేశారు. ఆర్కాడుకు చెందిన పారిశ్రామికవేత్త కన్నన్ (55) ఇంటికి గత జూలై 30వ తేదీ ఓ వ్యక్తి వచ్చి ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకొని, రూ.6 లక్షలు తీసుకొని వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ఆర్కాడు పోలీసులు శివానందంనగర్కు చెందిన ఎయిల్, భరత్, చెన్నై ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసులో పనిచేస్తున్న యాదవ్ సహా ఆరుగురిని ఆగస్టు 5వ తేదీన అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చెన్నై ఆదంబాక్కంకు చెందిన నరేంద్రనాథ్ (42)ను ప్రత్యేక బృందం పోలీసులు ఈనెల 18వ తేదీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. జిల్లా ఎస్పీ సిఫారసు మేరకు నరేంద్ర నాథ్‌ను గూండా చట్టం కింద అరెస్టు చేసేందుకు కలెక్టర్ భాస్కర పాండియన్ ఉత్తర్వులు జారీచేశారు.