నాపై 14 ఏళ్లుగా అత్యాచారం

ABN , First Publish Date - 2021-01-13T07:52:06+05:30 IST

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. మంత్రిని బావగా పేర్కొన్న

నాపై 14 ఏళ్లుగా అత్యాచారం

 మహారాష్ట్ర మంత్రి ముండేపై గాయని ఫిర్యాదు


ముంబై, జనవరి12: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండేపై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. మంత్రిని బావగా పేర్కొన్న ఆ యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఆమె మంగళవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని ముండే తనను లోబర్చుకున్నారని తన ప్రాణాలకు ముప్పు ఉందని, పోలీసులను కాపాడాలని కోరింది. అయితే, ఈ ఆరోపణలను ముండే ఖండించారు. 


Updated Date - 2021-01-13T07:52:06+05:30 IST