దంపతుల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-21T16:52:59+05:30 IST

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

దంపతుల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

 హైదరాబాద్/రాంనగర్‌ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. హరినగర్‌కు చెందిన మోహన్‌(36), రాధ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న కారణంగా ఈనెల 17న భార్య పిల్లలతో కలిసి అడ్డగుట్టలోని పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో మోహన్‌ ఈ నెల 19 రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. శనివారం ఉదయం మోహన్‌ తల్లి శోభారాణి పిలిచినా తలుపు తీయకపోవడంతో పొరు గువారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. మోహన్‌ ఉరేసుకుని కనిపించడంతో ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-03-21T16:52:59+05:30 IST