మద్యం మత్తులో భార్య పైకి కత్తిపీట.. గురి తప్పి..

ABN , First Publish Date - 2021-04-29T14:47:28+05:30 IST

మద్యం మత్తులో భార్య పై కత్తిపీట విసిరాడో భర్త. అది గురితప్పి

మద్యం మత్తులో భార్య పైకి కత్తిపీట.. గురి తప్పి..

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : మద్యం మత్తులో భార్య పై కత్తిపీట విసిరాడో భర్త. అది గురితప్పి కుమార్తెకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. అంతటితో ఆగకుండా తన సోదరుడి కుమారుడిని కూడా కొట్టడంతో గాయపడ్డాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ బీఎన్‌ఆర్‌హిల్స్‌లో నివసించే మార్క రమేష్‌, లావణ్యలు భార్యాభర్తలు. రమేష్‌ ప్రైవేటు ఉద్యోగి. వీరి కుమార్తె అక్షయ. రమేష్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు.


ఈ నెల 27న కూడా మద్యం తాగి వచ్చాడు. మత్తులో భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగింది. రమేష్‌ అక్కడే ఉన్న కత్తి పీట తీసుకొని భార్య మీదకు విసిరాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న  కుమార్తె అక్షయ మీద పడింది. ఆమె నుదిటికి తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. రమేష్‌ ఆగకుండా సోదరుడి కుమారుడు అభినవ్‌పై దాడి చేయడంతో అతడి చేతి ఎముక విరిగింది. గాయపడ్డ ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-29T14:47:28+05:30 IST