జీడిమెట్ల అడవిలో స్నేహితులు మృతి.. హత్యా.. ఆత్మహత్యా..!?

ABN , First Publish Date - 2021-01-13T13:50:14+05:30 IST

ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..?

జీడిమెట్ల అడవిలో స్నేహితులు మృతి.. హత్యా.. ఆత్మహత్యా..!?

హైదరాబాద్/జీడిమెట్ల : అదృశ్యమైన ఇద్దరు స్నేహితులు అడవిలో చెట్టుకు వేలాడుతూ శవాలై కనిపించారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా..? ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీడిమెట్ల సీఐ బాలరాజు కథనం ప్రకారం.. గాజులరామారం గ్రామానికి చెందిన బండోజి సత్యనారాయణ కుమారుడు సాయికుమార్‌ (22) ఎలక్ట్రీషియన్‌. ఈ నెల 10 సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చిన సాయికుమార్‌ కొంచెం సేపటి తర్వాత బయటకు వెళ్లాడు. కొడుకు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సత్యనారాయణ అందరినీ అడగడం మొదలుపెట్టాడు.


ఇంతలో సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన నరేష్‌ (22) ఫోన్‌ చేసి ‘మీ కొడుకు సాయికుమార్‌ నా తోనే ఉన్నాడు’ అని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. అదే రోజు రాత్రి నరేష్‌ తన తల్లికి ఫోన్‌చేసి అరగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లాల్‌సాబ్‌గూడ ఫారె్‌స్టలో ఇద్దరు యువకులు చెట్టుకు వేలాడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని సాయికుమార్‌, నరే్‌షగా గుర్తించారు. వారిద్దరు చీరలతో ఉరేసుకుని వేర్వేరు చెట్లకు వేలాడుతూ కనిపించారు. వీరి మృతికి గల కారణాలు తెలియలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చీరలు ఎక్కడ నుంచి వచ్చాయి..? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-13T13:50:14+05:30 IST