Chennai: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-29T13:05:21+05:30 IST

మదురై ఆరపాళయం ప్రాంతానికి చెందిన నన్మారన్‌ (72) గుండెపోటు కారణంగా మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందారు. మృతిచెందారు. 2001, 2006 శాసనసభ ఎన్ని

Chennai: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

పెరంబూర్‌(Chennai): మదురై ఆరపాళయం ప్రాంతానికి చెందిన నన్మారన్‌ (72) గుండెపోటు కారణంగా మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందారు. మృతిచెందారు. 2001, 2006 శాసనసభ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌) తరఫున మదురై తూర్పు నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలితతో సత్సం బంధాలు కలిగి ఉండడమే కాకుండా ప్రజలతో సన్నిహితంగా వుంటూ పార్టీకి, సమాజాభివృద్ధికి పాటుపడిన వ్యక్తిగా పేరుగాంచారు. ఎమ్మెల్యేగా మదురైలో ఐటీ పార్క్‌, టైడల్‌ పార్క్‌లు ఏర్పాటుకు తీవ్రంగా కృషిచేశారు. హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటుకు కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. పార్టీలో మదురై శాఖా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు జి.రామకృష్ణన్‌ సహా పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-10-29T13:05:21+05:30 IST