రెండు రోజులుగా కనిపించని వృద్ధుడు.. లభ్యమైన మృతదేహంపై కమిలిన గుర్తులు.. హతుడి వేటలో పోలీసులు
ABN , First Publish Date - 2021-11-06T16:54:23+05:30 IST
మానవ సంబంధాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి.

మానవ సంబంధాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. వృద్దులు అని కూడా చూడకుండా వారిపై హత్యలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌లో ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. జూనాపఢ్ జిల్లాలోని పాంచ్ గ్రామంలో ఒక వృద్ధుడు హత్యకు గురయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు హతుడెవరో తెలుసుకునే పనిలో పడ్డారు. మృతుని కుమారుడు బల్వీర్ సింగ్ తన తండ్రి హత్యకు గురయివుంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు.
అయితే మృతుని కుమారుడు ఈ హత్యపై ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. ఇదిలావుండగా అనూప్‌గఢ్ వద్ద పోలీసులకు ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమయ్యింది. వివరాలు సేకరించిన పోలీసులకు అది జగదీష్ సింగ్(62) మృతదేహమని తెలిసింది. అది బల్వీర్ సింగ్ తండ్రి మృతదేహమని పోలీసులు గుర్తించారు. అయితే ఆ మృతహంపై కమిలిన గాయలుండటంతో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. ఈ సందర్భంగా బల్వీర్ సింగ్ మాట్లాడుతూ తన తండ్రి జగదీష్ సింగ్ రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడని, రోజూ మాదిరిగానే మధ్యాహ్న భోజనం చేసి ఇంటినుంచి బయటకు వెళ్లి, మరి తిరిగిరాలేదన్నారు. దీంతో తాము తమకు అనుమానం ఉన్న అన్నిచోట్లా వెదికామన్నారు. ఈ నేపధ్యంలో తండ్రి మృతదేహం కనిపించిందన్నారు. తన తండ్రిని ఎవరో హత్యచేసి ఉండవచ్చని బల్వీందర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు.