క్షుద్రపూజ అనుమానం.. ఆరేళ్ల పిల్లాడి పీకపిసికి చంపేసిన దంపతులు!

ABN , First Publish Date - 2021-02-06T10:31:32+05:30 IST

మూఢనమ్మకాలతో కళ్లు మూసుకుపోయి, ఎదుటి వారి ప్రాణాలు తీయడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే తరహా..

క్షుద్రపూజ అనుమానం.. ఆరేళ్ల పిల్లాడి పీకపిసికి చంపేసిన దంపతులు!

ముంబై: మూఢనమ్మకాలతో కళ్లు మూసుకుపోయి, ఎదుటి వారి ప్రాణాలు తీయడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాకు చెందిన ఓ జంట ఓ గేదెను పెంచుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఈ గేదె అకస్మాత్తుగా మృత్యువాత పడింది.


తమ కుటుంబంపై ఎవరో క్షుద్రపూజలు చేయించారని వాళ్లు అపోహ పడ్డారు. అంతే తమకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ కుటుంబానికి చెందిన ఓ ఆరేళ్ల పసివాడిపై తమ కోపాన్ని ప్రదర్శించారు. పసివాడి పీక పిసికి దారుణంగా హతమార్చారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ స్కూలు దగ్గరలో మృదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత దీన్ని చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

Updated Date - 2021-02-06T10:31:32+05:30 IST