ఆన్‌లైన్‌లో రోజూ చాటింగ్ చేసుకున్నారు.. చివరకు ఆ మహిళలకు ఆశ చూపించి ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2021-10-21T00:59:00+05:30 IST
బెంగళూరులోని ఆస్టిన్‌టౌన్‌లో ఉంటున్న 37 ఏళ్ల మహిళ.. డేటింగ్ కోసం ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచమయ్యాడు. కొన్నాళ్లకు ఫోన్‌లో మాట్లాడుకునే వరకూ వచ్చారు.

ఆన్‌లైన్ పరిచయాలను అంత తేలిగ్గా నమ్మకూడదు. వారు చెప్పే తీపి మాటలను నమ్మితే కొంప కొల్లేరే. గుర్తు తెలియని పరిచయాలకు ఎంత దూరంగా ఉంటే.. అంత మంచింది. ఓ మహిళకు డేటింగ్ యాప్‌లో ఏర్పడిన పరిచయమే ఇందుకు ఉదాహరణ. ఆ అజ్ఞాత పరిచయం వల్ల చివరికి ఆమెకు జరిగిన నష్టం తెలుకుంటే షాక్ అవుతారు. అలాగే ఇంకో ఘటనలో ఓ మహిళ కూడా మోసపోయింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక బనశంకరి సమీపంలోని మడివాళ మారుతీనగరకు చెందిన 33 ఏళ్ల మహిళ.. నిత్యం అన్‌లైన్‌లోనే గడుపుతుండేది. పార్ట్‌టైం జాబ్ కోసం ఇంటర్నెట్‌లో పలు ప్రకటనలు చూసేంది. ఈ క్రమంలో ఆమెకు కొందరు పరిచయమయ్యారు. రోజూ చాటింగ్ చేసుకునే వారు. కొన్నాళ్ల తర్వాత వారితో ఆ మహిళ.. పార్ట్‌టైం జాబ్ గురించి చెప్పింది. ఇదే అదును కోసం ఎదరుచూస్తున్న వారు, మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నారు.

వస్తువులను అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఆమె వాట్సాప్ నంబర్‌కు ఓ రోజు దరఖాస్తు ఫారాన్ని పంపి నింపమన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ పేరుతో కొంత డబ్బులను తీసుకున్నారు. అంతటితో ఆగకుండా వివిధ కారణాలు చెప్పి.. విడతల వారీగా సుమారు రూ.19.67లక్షలను రాబట్టారు. తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆ మహిళ.. సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది.

మరో ఘటనలో.. బెంగళూరులోని ఆస్టిన్‌టౌన్‌లో ఉంటున్న 37 ఏళ్ల మహిళ.. డేటింగ్ కోసం ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచమయ్యాడు. కొన్నాళ్లకు ఫోన్‌లో మాట్లాడుకునే వరకూ వచ్చారు. విదేశాల్లో బాగా డబ్బు సంపాదిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. కొన్ని కారణాలు చెప్పి.. దశల వారీగా సుమారు రూ.18.29 లక్షలు జమ చేయించుకున్నాడు. చివరకు బాధితురాలు పోసపోయానని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించింది.
