రైల్వే స్టేషన్‌లో కోచింగ్ సెంటర్ టీచర్ కనిపించాడు కదా అని ఆ యువతి మాట్లాడింది.. కానీ అతడు చేసిన పనికి అందరూ షాక్..!

ABN , First Publish Date - 2021-10-19T19:10:30+05:30 IST

అమ్మమ్మ, మామయ్యలతో..

రైల్వే స్టేషన్‌లో కోచింగ్ సెంటర్ టీచర్ కనిపించాడు కదా అని ఆ యువతి మాట్లాడింది.. కానీ అతడు చేసిన పనికి అందరూ షాక్..!

ఇంటర్‌నెట్‌డెస్క్: అమ్మమ్మ, మామయ్యలతో కలిసి రైలులో ఊరికెళ్తున్న యువతికి.. ఓ రైల్వే స్టేషన్‌లో కోచింగ్ సెంటర్ టీచర్ కనిపించాడు. రైలు దిగి అతనితో మాట్లాడడానికి వెళ్లింది. రైలు కదులుతున్న ఆ యువతి తిరిగిరాకపోవడంతో బంధువులు కంగారుపడ్డారు. ఆ యువతి కోసం గాలించారు. కానీ ఆ యువతి ఎక్కడా కనిపించలేదు. ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. కాసేపటికి స్టేషన్‌కు వచ్చాడు. అందరూ ఎంత వెతికినా ఆ యువతి జాడ కనిపించలేదు. కూతురికోసం వెతుకుతున్న తండ్రికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తప్పిపోయిన కూతురు ఎక్కడ ఉందో తెలిసి ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రం బెట్టియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు..

 

జిల్లాలోని బనుచాపర్ గ్రామానికి చెందిన ఓ యువతి కమలానాథ్ నగర్‌లో దేవ్ కుమార్ పాండే నడుపుతున్న కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. పని మీద అమ్మమ్మ, మామయ్యలతో కలిసి సెప్టెంబర్ 12న అహ్మదాబాద్‌కు రైలులో పయనమైంది. రైలు గోరఖ్‌పూర్‌ స్టేషన్‌లో ఆగినప్పుడు ఆ యువతికి దేవ్ కుమార్ పాండే కనిపించాడు. ఆ యువతి మాట్లాడుదామని కిందికి వెళ్లింది. రైలు కూత వినపడినా కిందికి దిగిన యువతి రాకపోవడంతో అమ్మమ్మ, మామయ్య కంగారు పడ్డారు. ఆ యువతికోసం ఎంత వెతికినా కనపడకపోవడంతో భయపడిపోయారు. ఇక లాభం లేదనుకుని ఆ యువతి తండ్రికి విషయం చెప్పారు. కాసేపటికి ఆయన కూడా వచ్చి కూతురి కోసం వెతికాడు. కానీ ఆ అమ్మాయి కనిపించలేదు.కంగారు కంగారుగా కూతురికోసం వెతుకుతున్న ఆ తండ్రికి ఓ కొత్త నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘నా భర్తే మీ కూతురిని కిడ్నాప్ చేశాడు.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తనతోపాటు తీసుకొచ్చాడు. నన్ను, మీ కూతురిని ఎక్కడికి తీసుకొచ్చాడో నాక్కూడా తెలియదు’అని ఓ మహిళ చెప్పింది. ఆ ఫోన్ చేసిన మహిళ ఎవరో కాదు.. దేవ్ కుమార్ పాండే భార్య. కోచింగ్ సెంటర్ టీచరే ఆ యువతిని కిడ్నాప్ చేశాడని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. దేవ్ కుమార్ కోసం ఆ యువతి బంధువులు వెతకడం ప్రారంభించారు. ఎంతవెతికినా సమాచారం లభించకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ముఫాసిల్ పోలీస్‌స్టేషన్ అధికారి ఉగ్రనాథ్ ఝా మాట్లాడుతూ కమలానాథ్ నగర్‌లో కోచింగ్ సెంటర్ నడిపే డీకే పాండే అలియాస్ దేవ్ కుమార్ పాండే యువతిని కిడ్నాప్ చేశారన్నారు. కేసు నమోదు చేసుకొని అతనికోసం గాలిస్తున్నామన్నారు. దేవ్ కుమార్ పాండే తండ్రి పరమేశ్వర్ పాండే, తల్లి షీలా దేవిలను అరెస్టు చేశామని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.Updated Date - 2021-10-19T19:10:30+05:30 IST