భార్య వేధింపులు.. Bank ఉద్యోగి ఆత్మహత్య!.. సంచలనంగా మారిన సెల్ఫీ వీడియో
ABN , First Publish Date - 2021-11-15T21:51:43+05:30 IST
గోల్కొండ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక సంతోష్ అనే బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: గోల్కొండ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక సంతోష్ అనే బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుని తన చావుకు కారణమైన వాళ్ల పేర్లను బయటపెట్టాడు. తనకు బతకాలనే కోరిక ఉన్నా తన భార్య వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తను చెయ్యని తప్పులకు బజారుకీడ్చి పరువుతీసిందని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఈ కేసులో సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీకి చెందిన కల్యాణి అనే యువతితో సంతోష్‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి 6 ఏళ్ల బాబు ఉన్నాడు.