మూడేళ్ల కూతురి ఏడుపు విని ఉలిక్కిపడి నిద్రలేచిన తల్లి.. ఆ పాప ఉన్న పరిస్థితిని చూసి షాక్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-07T21:55:32+05:30 IST

అప్పటి వరకు ఆ చిన్నారి తల్లి ఒడిలోనే ఆడుకుంది. రాత్రి పాపకు అన్నం తినిపించి, జోల పాడి పడుకోపెట్టింది. తల్లి కూడా బిడ్డ పక్కనే పడుకుంది. ఇద్దరూ ఆదమరిచి నిద్రపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పాప బిగ్గరగా ఏడవడం

మూడేళ్ల కూతురి ఏడుపు విని ఉలిక్కిపడి నిద్రలేచిన తల్లి.. ఆ పాప ఉన్న పరిస్థితిని చూసి షాక్.. అసలేం జరిగిందంటే..

భోపాల్: అప్పటి వరకు ఆ చిన్నారి తల్లి ఒడిలోనే ఆడుకుంది. రాత్రి పాపకు అన్నం తినిపించి, జోల పాడి పడుకోపెట్టింది. తల్లి కూడా బిడ్డ పక్కనే పడుకుంది. ఇద్దరూ ఆదమరిచి నిద్రపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పాప బిగ్గరగా ఏడవడం వినిపించిందా తల్లికి. ఉలిక్కిపడి నిద్ర లేచి పాపను చూసింది. తన కూతురు ఉన్న సీరియస్ కండీషన్ చూసి ఆమె షాక్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగింది. ఇంతకీ అపుడేం జరిగిందంటే..


ఓ మూడేళ్ల చిన్నారి కడు పేదరికంలో పుట్టింది. ఆమె కుటుంబసభ్యులు ఓ గుడిసెలో ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు. దానికి తలుపులు కూడా అమర్చుకోలేని పరిస్థితి వారిది. అయినా ఆ తల్లిదండ్రులు పాపను ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆ పాపకు తల్లి గోరుముద్దలు తినిపించి, జోలాపాడి పడుకోబెట్టింది. పాప పక్కనే తల్లి కూడా నిద్రపోయింది. తమ ఇంటి పక్కనే ఉండి, జులాయిగా తిరిగే ఓ 20 ఏళ్ల కామాంధుడి కళ్లు ఆ పాప మీద పడ్డాయి. 


అదను చూసి తల్లీకూతుళ్లు ఆదమరిచి నిద్రపోతున్నపుడు మెల్లగా ఆ గుడిసెలోకి దూరి నిద్రిస్తున్న పాపను జేన్ ప్రాంతానికి ఎత్తుకెళ్లాడు. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో ఆ కామాంధుడు పాపపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చిన్నారిని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. పాప బిగ్గరగా ఏడుస్తుండడంతో తల్లికి మెలకువ వచ్చి లేచి చూసింది. పాప ఒంటిపై గాయాలను చూసి షాకయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పాపను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు చెబుతున్నారు. పోలీసులు నిందితుడికి కోసం గాలిస్తున్నారు.Updated Date - 2021-10-07T21:55:32+05:30 IST