అర్థరాత్రి ప్రియుడి వద్దకు 15ఏళ్ల యువతి.. బలాత్కరించిన ప్రియుడు.. తిరిగొస్తుండగా మరో ముగ్గురు గ్యాంగ్ రేప్.. ట్విస్ట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2021-08-21T12:32:06+05:30 IST
స్త్రీలు అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతిపిత గాంధీ ఒకనాడు చెప్పారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం..
రాయ్‌పూర్: స్త్రీలు అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతిపిత గాంధీ ఒకనాడు చెప్పారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అర్థరాత్రి బయటకు వెళ్లిన ఓ యువతిని పాశవికంగా నలుగురు అనుభవించారు. ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడిని కలిసేందుకు అర్థరాత్రి అతడి వద్దకు వెళ్లిన 15 యువతి అతడి చేతిలో బలాత్కరానికి గురైంది. ఆగస్టు 15 రాత్రి 1 గంట సమయంలో యువతని నిర్మానుష్య ప్రదేశానికి పిలిచిన ప్రియుడు.. అక్కడికి వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడు. అదే సమయంలో అటుగా ఓ బైక్ రావడంతో యువతిని అక్కడే వదిలిపెట్టిన ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అక్కడి నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగివస్తుండగా మరో ముగ్గురు బైక్‌పై ఆమెను సమీపించి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో దుస్తులు కుక్కి.. ఒకరి తర్వాత మరొకరు గ్యాంగ్ రేప్ చేశారు. తాము అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన యువతి ఇంటికి బయలుదేరింది. తెల్లవారుజామున 4:30 గంటలకు ఇంటికి చేరుకుంది. అయితే బట్టలు చిరిగిపోయి, మట్టికొట్టుకున్న దుస్తులతో కుమార్తెను చూసిన తల్లి.. ఏం జరిగిందని నిలదీసింది. ఇక్కడే ఆ యువతి ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనపై ప్రియుడు చేసిన బలాత్కారం గురించి యువతి చెప్పింది. వెంటనే కూతురిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లి.. అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్ తరలించారు.
అయితే రెండు రోజుల తరువాత తనపై దారిలో జరిగిన దారుణాన్ని కూడా యువతి తన తల్లికి చెప్పింది. పోలీసులకు ఈ విషయం తెలియడంతో నిందితులను అరెస్టు చేశారు. డుమర్డీహ్ గ్రామానికి చెందిన కామోశ్వర్ వర్మా, కౌశల్ పటేల్, రాజేశ్ వర్మలలను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనపై రెండు వేరు వేరు కేసులు నమోదు చేసినట్లు గాతాపార్ స్టేషన్ ప్రధానాధికారి వెల్లడించారు. మొదటి కేసులో యువతి ప్రియుడు మైనర్ కావడంతో అతడిపై వేరుగా.. ఆ తర్వాత గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారంతా పాతికేళ్లు దాటినవారు కావడంతో వారిపై వేరుగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.