సిటీలో ఉంటూ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న 21 ఏళ్ల యువకుడు.. హాస్టల్ గదిలో అద్దం వెనుక తన ప్రేయసి ఫొటోను అతికించి మరీ..

ABN , First Publish Date - 2021-12-09T23:44:46+05:30 IST

ఆ కుర్రాడి వయసు 21 ఏళ్లు. తల్లిదండ్రుల దగ్గరే ఉండి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత సిటీకి వెళ్లాడు

సిటీలో ఉంటూ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న 21 ఏళ్ల యువకుడు.. హాస్టల్ గదిలో అద్దం వెనుక తన ప్రేయసి ఫొటోను అతికించి మరీ..

లక్నో: ఆ కుర్రాడి వయసు 21 ఏళ్లు. తల్లిదండ్రుల దగ్గరే ఉండి డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత సిటీకి వెళ్లాడు. కొద్ది రోజుల నుంచి హాస్టల్‌లో ఉంటూ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఓ రోజు హాస్టల్ గదిలో అద్దం వెనుక తన ప్రేయసి ఫొటోను అతికించి మరీ అతడు చేసిన పని తెలిస్తే షాకవుతారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే..


జలౌన్‌లోని ఒరై దహెఖండ్ దివారా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల శివం డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. హిత్కారీ నగర్‌లోని లాల్జీ బాజ్‌పై హాస్టల్ ఉంటూ బ్యాంక్ ఎగ్జామ్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. శివం తండ్రి జ్ఞానేంద్ర సింగ్ చౌహన్ రిటైర్డ్ జవాన్. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి హాస్టల్ ఉండి చదువుకుంటున్న శివంకు కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు హాస్టల్ యజమాని లాల్జీ బాయ్‌పైకు సమాచారం అందించారు. అతడు వెంటనే శివం ఉంటున్న గదికి వెళ్లి ఎన్నిసార్లు తలుపులు తట్టినా తెరవలేదు. దీందో వెంటనే లాల్జీ కాల్యాణ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా అక్కడ ఫ్యాన్‌కు వేలాడుతూ శివం మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 


విచారణలో భాగంగా పోలీసులు శివం గదిని అంతా వెతకగా అక్కడ వారికి ఓ కీలక ఆధారం లభించింది. అద్దం వెనుక ఒక అమ్మాయి ఫొటో అతికించి ఉంది. ఆ ఫొటో దగ్గర ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్యాణ్‌పూర్ పోలీస్ ఇంచార్జ్ అశోక్ కుమార్ దుబే మాట్లాడుతూ.. శివం ఎప్పుడూ తన ప్రియురాలితో ఫోన్ మాట్లాడేవాడని విచారణలో తేలిందన్నారు. అయితే కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో అతడు ఫోన్ మాట్లాడడం మానేశాడని.. నిరాశతో కుంగిపోయిన శివం ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శివం ప్రియురాలిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. అయితే ప్రియురాలి ఫొటో ముందున్న సూసైడ్ నోట్‌లో.. ‘‘రేణు నువ్వు చేస్తున్న పని సరైంది కాదు.. నువ్వు నన్ను మోసం చేశావ్. అసలు నన్ను ఎందుకు ప్రేమించావు’’ అని రాసి ఉంది. అంతేకాకుండా తన మరణానంతరం తన ప్రియురాలిని ఎవరూ వేధించకూడదని కూడా కోరుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం కల్యాణ్‌పూర్ స్టేషన్‌ పోలీసులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 


Updated Date - 2021-12-09T23:44:46+05:30 IST