ఆ 17 ఏళ్ల బిటెక్ కుర్రాడు అక్రమంగా తెచ్చిన ఆయుధంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.. సాయంత్రం అతని సోదరుడు వచ్చి చూసేసరికి..

ABN , First Publish Date - 2021-11-21T14:30:03+05:30 IST

రాజస్థాన్‌లోని అల్వర్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న..

ఆ 17 ఏళ్ల బిటెక్ కుర్రాడు అక్రమంగా తెచ్చిన ఆయుధంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.. సాయంత్రం అతని సోదరుడు వచ్చి చూసేసరికి..

రాజస్థాన్‌లోని అల్వర్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యశ్ యాదవ్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యశ్ యాదవ్ వయసు 17 ఏళ్లు. సూసైడ్ చేసుకోవడానికి ముందు యశ్ యాదవ్ అక్రమంగా ఒక తుపాకీ సంపాదించాడు. ఇటీవలే 12వ తరగతి పాసయిన యశ్ యాదవ్ నోయిడాలోని  ఒక కాలేజీలో బీటెక్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. శనివారం అతను నోయిడా వెళ్లాల్సి ఉన్నప్పటికీ, సాయంత్రం చీకటి పడ్డాక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యశ్ యాదవ్ భివాడీకి చెందిన వ్యక్తి. అతని కుటుంబ సభ్యులు యూపీకి చెందినవారు. వారి కుటుంబం చాలా కాలంగా భివాడీలో ఉంటోంది. యశ్ తండ్రి.. సెంట్రల్ మార్కెట్‌లో దుస్తులు విక్రయిస్తుంటాడు.
సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో యశ్ ఒంటరిగా ఉన్నాడు. రాత్రి అతని సోదరుడు ఇంటికి వచ్చినప్పుడు యశ్ మృత దేహాన్ని చూశాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపించి, ఈ ప్రక్రియ పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం జేఈఈలో.. యస్ కి మంచి ర్యాంకు రాలేదు. దీంతో అతనికి ప్రభుత్వ కళాశాలలో సీటు దొరకలేదు. దీంతో యశ్ తీవ్రంగా కలత చెందాడు. అయితే యశ్.. నోయిడాలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. శనివారం యశ్ కాలేజీకి వెళ్లాల్సివుంది. ఇంతలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇందుకోసం ఒక తుపాకీని అక్రమంగా సంపాదించాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పటికీ యశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కాగా యశ్ సోదరుడు ఇటీవలే ఐఐటీ చదువు పూర్తి చేశాడు. ఇంట్లో తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. యశ్ ఆత్మహత్య స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-21T14:30:03+05:30 IST