తల్లిని తిట్టాడని సీనియర్‌ని పొడిచి చంపిన జానియర్

ABN , First Publish Date - 2021-10-03T02:46:48+05:30 IST

మృతుడు తన తల్లిని తిట్టాడని వెంటనే తన తల్లికి క్షమాపణ చెప్పాలని నిందితుడు పలుమార్లు కోరాడు. అయితే దీనికి నిరాకరించడంతో పాఠశాల ఆవరణలోనే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పొడిచాడు..

తల్లిని తిట్టాడని సీనియర్‌ని పొడిచి చంపిన జానియర్

న్యూఢిల్లీ: తన తల్లిని తిట్టాడనే కారణంతో తన సీనియర్‌ను చంపాడు ఓ బాలుడు. నిందితుడు, బాధితుడు ఇద్దరు మైనర్లే కావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలో  శుక్రవారం ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడు (15) 10వ తరగతి, మృతుడు (17) 11వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరిదీ ఒకటే పాఠశాల. అంతే కాదు హత్య జరిగిన సమయంలో ఇద్దరూ స్కూల్ యూనిఫాంలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


మృతుడు తన తల్లిని తిట్టాడని వెంటనే తన తల్లికి క్షమాపణ చెప్పాలని నిందితుడు పలుమార్లు కోరాడు. అయితే దీనికి నిరాకరించడంతో పాఠశాల ఆవరణలోనే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, నిందితుడిని జువైనల్ హోంకి తరలించామని, కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

Updated Date - 2021-10-03T02:46:48+05:30 IST