అమెరికా నైట్ క్లబ్బులో కాల్పులు.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-03-21T10:33:57+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ మోతలు మారుమోగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరా్లోకి వెళ్తే..

అమెరికా నైట్ క్లబ్బులో కాల్పులు.. ఒకరు మృతి

డల్లాస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ మోతలు మారుమోగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరా్లోకి వెళ్తే.. డల్లాస్‌లోని ప్రైమ్  నైట్ క్లబ్బులో రెండు బృందాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒక బృందంలోని వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పులు జరిపిన దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, దర్యాప్తు శరవేగంగా జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు.

Updated Date - 2021-03-21T10:33:57+05:30 IST