‘టాప్ 100 మోస్ట్ వ్యాల్యూడ్ లిస్టెడ్ కంపెనీ’ల జాబితాలో ‘జొమాటో’...

ABN , First Publish Date - 2021-07-08T22:06:54+05:30 IST

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో... భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో టాప్ 100 మోస్ట్ వ్యాల్యూడ్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చోటుదక్కించుకుంది.

‘టాప్ 100 మోస్ట్ వ్యాల్యూడ్ లిస్టెడ్ కంపెనీ’ల జాబితాలో ‘జొమాటో’...

గురుగావ్ : ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో... భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో టాప్ 100 మోస్ట్ వ్యాల్యూడ్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో చోటుదక్కించుకుంది. జోమాటోకు రూ. 59,623 కోట్ల పోస్ట్-మనీ వాల్యుయేషన్ ఉంటుంది. ఇదే మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 100 ఇండియన్ లిస్టెడ్ కంపెనీల్లో... జొమాటోను 79 వ స్థానంలో నిలిపింది. వాస్తవానికి, హీరో మోటోకార్ప్, అరబిందో ఫార్మా, పిరమల్ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల పేర్ల కంటే జోమాటో మరింత మంచి ర్యాంకును సాధించడం విశేషం. 


జొమాటో తన ఐపీవోను ఈ నెల(జూలై) 14 న ప్రారంభించి, 16 న ముగించనున్నట్లు వెల్లడించింది. కాగా... ఇష్యూ ప్రైస్‌ను... షేరుకు రూ. 72-76 వద్ద ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీకి చెందిన ఎర్లీ ఇన్వెస్టర్ అయిన ఇన్ఫో ఎడ్జ్ సేల్ రూ. 375 కోట్లకు ఖరారు చేయాలని నిర్ణయించారు. అలాగే తాజాగా రూ. 9 వేల కోట్ల షేర్లను జొమాటో విడుదల చేయనుంది. ఈ స్టాక్... ఈ నెల  27 న ఎక్సేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశముంది. 

Updated Date - 2021-07-08T22:06:54+05:30 IST