‘చైనా మార్కెట్’పై... గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆసక్తి ఎందుకు ?
ABN , First Publish Date - 2021-11-28T21:38:54+05:30 IST
ఇండియా ఈక్విటీలను డౌన్ గ్రేడ్ చేసినందువల్లే... గ్లోబల్ ఇన్వెస్టర్లు చైనా మార్కెట్లకు వెళుతున్నారా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.

న్యూయార్క్ : ఇండియా ఈక్విటీలను డౌన్‌ట్రెండ్ డ్ చేసినందువల్లే... గ్లోబల్ ఇన్వెస్టర్లు చైనా మార్కెట్లకు వెళుతున్నారా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమ వినవస్తోంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న ఈక్విటీ మార్కెట్లు చైనా, ఇండియా అన్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ప్రపంచ పెట్టుబడిదారులు చైనా, భారత్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. కొంతకాలం క్రితం చైనా పట్ల వ్యతిరేకత భావనకు ‘కరోనా’నే కారణమన్న భావన కూడా ఉంది. ఆ క్రమంలోనే... ఇన్వస్టర్లు చూనాను డౌన్ గ్రేడ్ చేసి, ఇండియాకు అప్ గ్రేడ్ ఇచ్చారు. ఈ క్రమంలో... భారత్‌కు భారీగా ఇన్వెస్టర్లు వెల్లువెత్తారు. దీంతో ర్యాలీ నమోదైనట్లైంది.
కాగా... తాజాగా మళ్లీ బ్లాక్‌రాక్ ఐఎన్‌సీ వంటి కంపెనీలు చైనీస్ స్టాక్లను అప్‌గ్రేడ్ చేసింది. చైనాలో ఈక్విటీలకు మళ్లీ సమయం వచ్చిందంటున్న అభిప్రాయాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. అదే సమయంలో భారతీయ ఈక్విటీలకు దాని ఎక్స్పోజర్ను తగ్గిస్తోంది. అటు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇంక్, నోమురా హోల్డింగ్స్ ఇంక్ కూడా ఇటీవలి రోజుల్లో భారతీయ స్టాక్లను డౌన్‌గ్రేడ్ చేశాయి. ఆఫ్‌షోర్ చైనీస్ ఈక్విటీలను అప్‌గ్రేడ్ చేశాయి. బీజింగ్ ప్రభుత్వం నియంత్రణ చర్యల కారణంగా నష్టాలు... చైనీస్ ఈక్విటీలను చౌకగా మార్చాయి. అదే సమయంలో దక్షిణాసియా దేశంలోని షేర్లు ర్యాలీల కారణంగా ఖరీదైనవిగా మారాయి. ఎంఎస్సీఐ చైనా ఇండెక్స్ ఒక సంవత్సరం ఫార్వార్డ్ ఆదాయాల అంచనాల కంటే 13 రెట్లు తక్కువగా ట్రేడవుతోంది. అదే సమయంలో భారతీయ మార్కెట్లు 22 రెట్లు అధికంగా ఉన్నాయి.
బ్లాక్‌రాక్ ప్రకారం వచ్చే ఏడాది చైనాలో ద్రవ్య విధానం అనుకూలంగా ఉంటుందని, ఆర్థికవృద్ధి ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సానుకూల సెంటిమెంట్ ఆధారపడి ఉందని గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ల ఈక్విటీల కోసం బ్లాక్‌రాక్ పోర్ట్‌ఫోలియో అంటోంది. బ్లూమ్‌బెర్గ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఎంఎస్సీఐ చైనా ఇండెక్స్ రాబోయే సంవత్సర కాలంలో 39 % పురోగమిస్తుందని చెబుతున్నారు. చైనా ఈ సంవత్సరం భారత్‌కంటే 40 శాతానినక్నా ఎక్కువగానే వెనుకబడి ఉంది.
ఇక డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ పేటీఎం, భారతదేశపు అతిపెద్ద ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ధరల విలువలపై ఆందోళనల కారణంగా దాని తొలి దశలోనే విఫలమైన తర్వాత కొత్త జాబితాల పట్ల సెంటిమెంట్ కూడా దెబ్బతింది. కాగా... 2021 మొదటి తొమ్మిది నెలల కాలంలో వచ్చిన $8.5 బిలియన్లతో పోల్చితే, ఈ త్రైమాసికంలో 1.3 బిలియన్ డాలర్లను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. భారత్‌లో అధిక వాల్యుయేషన్ సమస్య ఉందని... స్వల్పకాలంలో దిద్దుబాటు ఉండవచ్చునని, వాల్యుయేషన్ పరిమితులకు పేటీఎం హెచ్చరిక అని జీడబ్ల్యూఅండ్‌కే ఇన్వెస్ట్మెంట్ చెబుతోంది. పేర్కొంటోంది.