కరోనా ఉధృతితో వృద్ధి రికవరీ జాప్యం

ABN , First Publish Date - 2021-04-23T06:30:16+05:30 IST

భారత్‌కు గతంలో కేటాయించిన బీబీబీ మైనస్‌ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ ప్రకటించింది...

కరోనా ఉధృతితో వృద్ధి రికవరీ జాప్యం

  • బీబీబీ మైనస్‌ రేటింగ్‌ యథాతథం: ఫిచ్‌ 


న్యూఢిల్లీ: భారత్‌కు గతంలో కేటాయించిన బీబీబీ మైనస్‌ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ ప్రకటించింది. దేశ పరపతి సామర్థ్యంపై తన ‘ప్రతికూల’ వైఖరిని కూడా యధావిధిగా కొనసాగించింది. కరోనా కేసుల ఉధృతితో వృద్ధి పునరుద్ధరణ జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, పూర్తిగా పట్టాలు తప్పే ప్రమాదమేమీ లేదని గురువారం విడుదల చేసిన నివేదికలో ఫిచ్‌ పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరాని (2020-21)కి జీడీపీ వృద్ధి క్షీణతను మైనస్‌ 7.5 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 12.8 శాతానికి ఎగబాకవచ్చని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో వృద్ధి 5.8 శాతానికి పరిమితం కావచ్చని అంటోంది. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. దాంతో, గత ఏడాది జూన్‌లో భారత పరపతి సామర్థ్యంపై ఫిచ్‌ తన వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘ప్రతికూల’ స్థాయికి తగ్గించింది. 2006 ఆగస్టు నుంచి భారత్‌ పరపతి రేటింగ్‌ బీబీబీ మైన్‌సగానే కొనసాగుతోంది. వైఖరి మాత్రం తటస్థం, ప్రతికూల స్థాయిల మధ్య ఊగిసలాడుతోంది. 


Updated Date - 2021-04-23T06:30:16+05:30 IST