బడ్జెట్... ఆదాయ పన్నులో ఈ మార్పులుండేనా ?

ABN , First Publish Date - 2021-01-21T20:23:03+05:30 IST

కరోనా నేపధ్యంలో... ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్... ఉద్యోగాలు సృష్టించేలా, డిమాండ్ పెంచేందుకు ప్రజల చేతుల్లో మరింత డబ్బు ఉండేలా... ఉండే అవకాశముంటుందని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు.

బడ్జెట్... ఆదాయ పన్నులో ఈ మార్పులుండేనా ?

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో... ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్... ఉద్యోగాలు సృష్టించేలా, డిమాండ్ పెంచేందుకు ప్రజల చేతుల్లో మరింత డబ్బు ఉండేలా... ఉండే అవకాశముంటుందని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మందగమనం తర్వాత దెబ్బ మీద దెబ్బ అన్నట్లు కరోనా అంతకంటే ఎన్నో రెట్లు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం కొత్త బడ్జెట్ పై పలు రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 


ఆదాయపు పన్ను, స్టాండర్డ్ డిడక్షన్... ప్రధానంగా ఎప్పటిలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కరోనా నేపధ్యంలో... వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో... వీరి చేతుల్లో మరింత ద్రవ్యముండేలా చర్యలను ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచే ప్రకటన వెలువడవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు... హయ్యర్ స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతమున్న రూ. 50 వేల నుండి రూ. 75 వులకు లేదా రూ. లక్షకు  పెంచవచ్చునని భావిస్తున్నారు.


రెండు రకాల పన్నులకు బదులు...

ఇక ప్రస్తుతం రెండు రకాల ఆదాయ పన్ను పద్ధతులు ఉన్న విషయం తెలిసిందే. మొదటిది... అన్ని మినహాయింపులు పొందుతూ పన్ను చెల్లించడం కాగా, రెండోది మినహాయింపులు లేకుండా ఆదాయానికి వర్తించే స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించడం. ఈ రెండింట్లో ఏది ఎంచుకోవాలనే అంశంపై ఇప్పటికీ కొంత అయోమయమున్న పరిస్థితి తెలిసిందే. టికి బదులు స్లాబ్స్ సవరించడమే సముచితంగా ఉంటుందన్నఅభిప్రాయాలు వినవస్తున్నాయి. రూ. 5 లక్షల వార్షికాదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తూ స్లాబ్స్ సవరిస్తే సరిపోతుందని చెబుతున్నారు.


80 సీ ఉపశమనం కలిగేనా ? 

కాగా... ఇటీవలి కాలంలో ఏ బడ్జెట్‌లోనూ 80 సీకి సవరణలు చేయలేదన్న విషయం తెలిసిందే. ఈ సెక్షన్ కింద ఈపీఎప్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియం, పిల్లల విద్యకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, హోం లోన్ అసలు, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా ఫిక్స్డ్‌డ్ డిపాజిట్ల వంటివి ఉంటాయి. వీటిపై రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. 


అయితే... ద్రవ్యోల్భణంతో పోలిస్తే ఈ మినహాయింపు మొత్తం ద్వారా వచ్చే ప్రయోజనం తక్కువేని చెబుతున్నారు. ఈ క్రమంలో... సెక్షన్ 80 సీ కింద మినహాయింపు పరిమితిని పెంచాల్సి ఉంటుందని భావిస్తున్నారు. వీటిలో... బీమా, హోం లోన్ అసలు మొత్తాలనైనా సవరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 


Updated Date - 2021-01-21T20:23:03+05:30 IST