సిమెంట్ కంపెనీలకు కలిసొచ్చేనా ?

ABN , First Publish Date - 2021-10-29T09:03:18+05:30 IST

‘ఈ రోజు వరకు ఒక లెక్క., ఇక మీదట ఓ లెక్క’ అంటున్నాయి సిమెంట్ కంపెనీలు. రానున్నదంతా మాకు కలిసొచ్చే కాలమేనంటూ ఢంకా బజాయిస్తున్నాయి.

సిమెంట్ కంపెనీలకు కలిసొచ్చేనా ?


హైదరాబాద్ : ‘ఈ రోజు వరకు ఒక లెక్క., ఇక మీదట ఓ లెక్క’ అంటున్నాయి సిమెంట్ కంపెనీలు. రానున్నదంతా మాకు కలిసొచ్చే కాలమేనంటూ ఢంకా బజాయిస్తున్నాయి. బలమైన డిమాండ్ ఔట్‌లుక్ అంచనాతో,  బలహీనమైన మార్కెట్‌లో సిమెంట్ కంపెనీల షేర్లు స్టేబుల్‌గా ట్రేడయ్యాయి. కోవిడ్ ప్రేరిత పరిమితుల కారణంగా ఇప్పటి వరకైతే పెద్దగా డిమాండ్ లేదు. కానీ దీర్ఘకాలిక వృద్ధిపథం చూస్తే... స్వల్పకాలిక డిమాండ్ ప్రభావం చూపినప్పటికీ, రోడ్లు, మెట్రోలు, నీటిపారుదల విభాగం, రాబోయే రాష్ట్ర, సాధారణ ఎన్నికలు తదితరాలు సిమెంట్ కంపెనీలకు కలిసొచ్చే అంశాలే. డిమాండ్‌ను మరింత పెంచడానికి అర్బన్ హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లలో వేగం చోటుచేసుకోనుంది.


గురువారం నాటి ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, ప్రిజం జాన్సన్, ఏసీసీ, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్, ఓరియంట్ సిమెంట్, బిర్లా కార్పొరేషన్‌లు 2-4 శాతం వరకు పెరిగాయి. గ్రామీణ గృహాల్లో పునరుద్ధరణ, ఖరీఫ్ కార్పొరేషన్‌కు అధిక ఎంఎస్‌పీ(కనీస మద్దతు ధర), రబీ పంటలో మెరుగైన ఆహార ధాన్యాల ఉత్పత్తి, వరుసగా మూడవ సాధారణ రుతుపవనాలు, మౌలిక సదుపాయాల ఆధారిత నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడం సిమెంట్ డిమాండ్‌ పై ప్రభావం చూపుతాయని అక్టోబరు 18 న వెల్లడైన సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ అల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది. 

Updated Date - 2021-10-29T09:03:18+05:30 IST