బంగారం., బిట్ కాయిన్... ఏది బెటర్ ?

ABN , First Publish Date - 2021-10-29T05:14:08+05:30 IST

బంగారానికి ప్రత్యామ్నాయంగా క్రిప్టో కరెన్సీ దూసుకు వస్తోన్న విషయం తెలిసిందే. కరోనా నేపధ్యంలో... ఓ వైపు స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే, మరోవైపు బంగారం, ఇంకోవైపు క్రిప్టో ధరలు భారీగా పెరిగాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ. 56,200 కు చేరుకుంది.

బంగారం., బిట్ కాయిన్... ఏది బెటర్ ?

హైదరాబాద్ : బంగారానికి ప్రత్యామ్నాయంగా క్రిప్టో కరెన్సీ దూసుకు వస్తోన్న విషయం తెలిసిందే. కరోనా నేపధ్యంలో... ఓ వైపు స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే, మరోవైపు బంగారం, ఇంకోవైపు క్రిప్టో ధరలు భారీగా పెరిగాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ. 56,200 కు చేరుకుంది. ఇక... క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ కూడా 65 వేల డాలర్లను తాకింది. తాజాగా... ఈ రికార్డును కూడా బద్దలైంది. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోను బంగారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... బంగారంపై పెట్టుబడి పెట్టాలా ? క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలా ? అన్న ప్రశ్న సహజంగానే రేకెత్తుతుంది. ఈ క్రమంలో... ఈ కథనం చదవండి.... 


క్రిప్టోను పలు దేశాలు ఇప్పటికీ అంగీకరించడం లేదన్న విషయం తెలిసిందే. అది మినహాయించి ఇది తక్కువ కాలంలోనే అద్భుతంగా రాణించింది. బంగారం ఆకర్షణీయం... బిట్ కాయిన్ గోల్డ్ 2.0...  బంగారం భారతీయులకు ఆకర్షణీయ పెట్టుబడి సాధనం. ద్రవ్యోల్భణం హెడ్జ్(పెట్టుబడి), స్వల్పకాలిక నగదు రుణాలకు, ద్రవ్యత కోసం ఉపయోగపడతాయి. మరో విషయమేమిటంటే...  బంగారాన్ని కొనుగోలు చేయడానికి బ్యాంకులతో అవసరం లేదు. ఇక క్రిప్టో కరెన్సీ పూర్తి డిజిటల్ అసెట్. ఇటీవలి కాలంలో ఇది ఆకర్షణీయ పెట్టుబడి సాధనంగా కనిపిస్తోంది. క్రిప్టోలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా బిట్ కాయిన్ అతిపెద్దది. దీనిని గోల్డ్ 2.0 అని చెబుతారు. ప్రారంభం నుంచి కూడా పరుగులు పెడుతూనే ఉంది.


ఇదే పరుగు 2022 లో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది మార్కెట్ నిపుణుల మాట. కొంత కాలం నుంచి బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం పది మిలియన్లకు పైగా వినియోగదారులు పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి చట్టబద్ధతకు సంబంధించిన అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల బంగారంతో పాటు క్రిప్టో కూడా ఎగిసిపడుతున్నందున ఈ రెండింటిని పోల్చడం సాధారణంగా మారింది.

Updated Date - 2021-10-29T05:14:08+05:30 IST