వచ్చే ఏడాది వోల్వో ఎలక్ట్రిక్ కారు
ABN , First Publish Date - 2021-10-28T08:18:00+05:30 IST
స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో కార్స్ తొలి ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాదిలో విడుదల చేయనుంది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో కార్స్ తొలి ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాదిలో విడుదల చేయనుంది. 2030 నాటికి అన్ని మోడళ్లలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు వోల్వో కార్ ఇండియా అమ్మకాల అధిపతి ప్రకాశ్ మిశ్రా తెలిపారు. దేశంలో పెట్రోల్ కార్లకు భారీగా గిరాకీ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వోల్వో డీజిల్ నుంచి పెట్రోల్ కార్ల వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. త్వరలోనే మొత్తం కార్లను పెట్రోల్ కార్లుగా మార్చనున్నట్లు తెలిపారు. లగ్జరీ సెడాన్ ఎస్90, లగ్జరీ ఎస్‌యూవీ ఎక్స్‌సీ60 మోడళ్లలో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ కార్లను వోల్వో విడుదల చేసింది. ఈ కార్లను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రకాశ్ మిశ్రా ప్రవేశపెట్టారు. ఈ రెండు కార్ల ధర రూ.61.9 లక్షలు (హైదరాబాద్ ఎక్స్‌షోరూమ్).