‘వెస్పా’... మళ్ళీ భారత్‌లోకి...

ABN , First Publish Date - 2021-08-20T21:36:35+05:30 IST

ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో... మళ్ళీ భారత్‌లోకి అడుగుపెట్టింది.

‘వెస్పా’... మళ్ళీ భారత్‌లోకి...

హైదరాబాద్ : ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో... మళ్ళీ భారత్‌లోకి అడుగుపెట్టింది. వెస్పా బ్రాండ్‌ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెస్పా 75జీ’ పేరుతో ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు పియాజియో ఇండియా ప్రకటించింది. ఇక... వెస్పా 75జీ... రెండు వేరియంట్స్‌లో వస్తోంది. 125సీసీతో పాటు 150సీసీ ఇంజన్‌ ఆప్షన్లలో వాహనం లభించనుంది. ఇక ధర విషయానికొస్తే...  125సీసీ స్కూటర్‌ ధర రూ. 1.25 లక్షలు కాగా, 150 సీసీ వెర్షన్‌ ధర రూ. 1.39 లక్షలు.  


స్పెషిఫికేషన్స్... ఈ స్కూటర్ల సైడ్ ప్యానెల్స్ పై '75' డెకాల్స్ అనే ప్రత్యేక నంబర్ ఉంటుంది. కాగా... 125సీసీ మోడల్ 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 9.93హెచ్‌పీ పవర్, 5,500 ఆర్‌పీఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 150 సీసీ సామర్థ్యం గల స్కూటర్ విషయానికి వస్తే.. 7,600 ఆర్‌పీఎమ్ వద్ద 10.4 హెచ్‌పీ పవర్, 5,500 ఆర్‌‌పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటిలో ముందు వైపున 200  ఎంఎం డిస్క్, వెనుక వైపున 140 ఓవఓవ డ్రమ్ బ్రేక్స్‌తో వస్తాయి. 125 సీసీ మోడల్‌లో సీబీఎస్ సిస్టమ్ ఉంటుంది.

Updated Date - 2021-08-20T21:36:35+05:30 IST