‘వెరా’ స్మార్ట్‌ క్లినిక్స్‌

ABN , First Publish Date - 2021-10-20T07:57:29+05:30 IST

వెరా స్మార్ట్‌ హెల్త్‌కేర్‌కు చెందిన వెరా క్లినిక్స్‌ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ క్లినిక్‌లు, మొబైల్‌ యూనిట్ల ఏర్పాటు, ఇతర స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సేవలకు వివిధ మెడికల్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

‘వెరా’ స్మార్ట్‌ క్లినిక్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వెరా స్మార్ట్‌ హెల్త్‌కేర్‌కు చెందిన వెరా క్లినిక్స్‌ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ క్లినిక్‌లు, మొబైల్‌ యూనిట్ల ఏర్పాటు, ఇతర స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సేవలకు వివిధ మెడికల్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 1.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని వెరా క్లినిక్స్‌ సీఈఓ ధర్మ తేజ నూకరాజు తెలిపారు. డోర్‌-టు-డోర్‌ డయాగ్నోస్టిక్‌ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలన్నది తమ లక్ష్యమని, టెక్నాలజీతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. 

Updated Date - 2021-10-20T07:57:29+05:30 IST