యూరోపియన్‌ కంపెనీలో అమరరాజా పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-12-30T07:56:10+05:30 IST

యూరోపియన్‌ కంపె నీ ఇనోబ్యాట్‌ ఆటోలో అమర రాజా పెట్టుబడులు పెట్టనుంది. ఇనోబ్యాట్‌ ఈ-మొబిలిటీ కోసం ప్రీమియం ..

యూరోపియన్‌ కంపెనీలో  అమరరాజా పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యూరోపియన్‌ కంపె నీ ఇనోబ్యాట్‌ ఆటోలో అమర రాజా పెట్టుబడులు పెట్టనుంది. ఇనోబ్యాట్‌ ఈ-మొబిలిటీ కోసం ప్రీమియం ఇన్నోవేటివ్‌ బ్యాటరీలను అభివృద్ధి చేసి తయారు చేస్తున్న టెక్నాలజీ కంపెనీ. ఈ పెట్టుబడుల ద్వారా వేగంగా వృద్ధి చెందుతున్న యూరోపియన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోకి అడుగు పెట్టడానికి అవకాశం లభిస్తుందని అమర రాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. కంపెనీ ‘ఎనర్జీ అండ్‌ మొబిలిటీ’ వ్యూహంతో గ్రీన్‌ టెక్నాలజీపై దృష్టి పెడుతోంది. ఇందుకు ఇనోబ్యాట్‌లో పెట్టుబడులు దోహదం చేస్తాయని  తెలిపింది. ఈ- మొబిలిటీకి బ్యాటరీల తయారీకి అవసరమైన టెక్నాలజీలను పొందడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. ఇప్పటికే అమరరాజా బ్యాటరీస్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలోకి అత్యాధునిక ఇన్నోవేటివ్‌ బ్యాటరీ టెక్నాలజీని కంపెనీ తీసుకువెళుతుంది. స్వల్పకాలంలోనే ఇన్నోవేటివ్‌ బ్యాటరీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ గౌరినేని తెలిపారు. 

Updated Date - 2021-12-30T07:56:10+05:30 IST