అంతర్జాతీయంగా రూపే, యూపీఐ లావాదేవీలు... త్వరలో ...

ABN , First Publish Date - 2021-11-22T04:29:36+05:30 IST

పయనీరింగ్ ఇంటర్నేషనల్ ప్రొవైడర్ ఆఫ్ లోకల్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ అలయెన్స్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సంస్థలు... ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

అంతర్జాతీయంగా రూపే, యూపీఐ లావాదేవీలు... త్వరలో ...


ముంబై : పయనీరింగ్ ఇంటర్నేషనల్ ప్రొవైడర్ ఆఫ్ లోకల్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ అలయెన్స్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సంస్థలు... ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్(పనీఎస్‌పీఎస్) వంటి పీపీఆర్‌ఓ  ఇంటర్నేషనల్ కస్టమర్లు ప్రయోజనం పొందుతారు. అలాగే రూపే కార్డ్, యూపీఐ మద్దతును విస్తరించడం లక్ష్యంగా చేసుకున్నవారు ప్రయోజనం పొందుతారు. ఈ ఒప్పందం ఎన్‌ఐపీఎల్ కొత్త ప్రాంతాలకు విస్తరించడం కోసం సహాయపడుతుంది. అలాగే పీపీఆర్‌ఓ లోకల్ పేమెంట్ మెథడ్(ఎల్‌పీఎం) సర్వీస్ రీజియన్‌ను భారత్ సహా పలు ప్రాంతాలకు విస్తరించే క్రమంలో ఉపయోగపడుతుంది.


కాగా... పెద్దనోట్ల రద్దు తర్వాత గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలో క్రమబద్ధీకరణ పెరుగుతోంది. నగదు చలామణి కూడా అదే విధంగా పెరుగుతూ ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది. గత అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థలోని 80 శాతం వరకు నగదేతర విభాగాలను క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... కరోనా పరిణామాలు కూడా నగదు లావాదేవీలు అధికమయ్యేందుకు కారణమయ్యాయి. ఏ వస్తువును తాకకుండానే మొబైల్ ద్వారా జరిగే యూపీఐ లావాదేవీలు 2017 తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరిగినప్పటికీ, డెబిట్ కార్డు లావాదేవీలు మాత్రం తగ్గాయి.  నోట్ల రద్దు అనంతరం నగదు చలామణి జీడీపీ విలువలో 8.7 శాతానికి తగ్గింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇది 13.1 శాతంగా నమోదైంది. 2020-21 లో కరోనా పరిణామాల నేపధన్యంలో ఇది 14.5 శాతంగా ఉంది. ఆసుపత్రి  ఖర్చులు, ఇతర అత్యవసరాల కోసం ఎక్కువమంది నగదును అట్టిపెట్టుకుంటున్నారు. 2007-10 కాలంలో  ఆర్థిక వ్యవస్థ రాణించిన సమయంలో నగదు చలామణి వరుసగా 12.1 శాతం, 12.5 శాతం, 12.4 శాతంగా నమోదైంది. ఆ తర్వాత అయిదేళ్ల వరకు ఇదే ధోరణి కొనసాగింది. 2020-21 లో 14.5 శాతం వద్ద గరిష్ఠస్థాయిని చేరుకుంది. ముందుజాగ్రత్తగా ప్రజలు  రూ. 3.3 లక్షల కోట్లను నగదు రూపంలో అట్టిపెట్టుకోవడం ఇందుకు కారణం. ఆ సమయంలో జీడీపీ 7.3 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-22T04:29:36+05:30 IST