ట్విట్టర్... కొత్త లాగిన్ ఆప్షన్...

ABN , First Publish Date - 2021-08-04T02:33:50+05:30 IST

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్... స‌రికొత్త లాగిన్ ఆప్ష‌న్ ను తీసుకొచ్చింది.

ట్విట్టర్... కొత్త లాగిన్ ఆప్షన్...

శాన్‌ఫ్రాన్సిస్‌కో : మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్... స‌రికొత్త లాగిన్ ఆప్ష‌న్ ను తీసుకొచ్చింది. ఇందులో... కేవలం యాపిల్ ఐడీ ఉంటే చాలు.. ట్విట్ట‌ర్ లోకి లాగిన్ అవ్వొచ్చు. యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులు కేవ‌లం త‌మ యాపిల్ ఐడీతో లాగిన్ అయ్యే ఆప్ష‌న్‌ ఇది. అంతేకాదు... ఆండ్రాయిడ్ ఫోన్లు, విండోస్ కంప్యూట‌ర్ల వినియోగదారులు... కేవ‌లం గూగుల్ ఖాతాతో  ట్విట్ట‌ర్‌లోకి లాగిన్ కావచ్చు. కొత్త‌గా వ‌చ్చిన ఈ ఫీచ‌ర్ నేపధ్యంలో... సైన్ అప్ ప్రాసెస్ కూడా తేలికగా ఉంటుందని ట్వట్టర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మెయిల్ ఐడీ, పాస్‌వ‌ర్డ్, పేరు, ట్విట్ట‌ర్ యూజ‌ర్ హాండిల్ పేరు తదితర వివరాలను ఇవ్వాల్సిన అవ‌స‌రముండ‌దు. ట్విట్ట‌ర్ హాండిల్ పేరును కూడా ఆటోమెటిక్ గా సిస్ట‌మ్ స‌జెస్ట్ చేస్తంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ ఖాతా ఉన్న వినియోగదారులు  మాత్రం త‌మ ఖాతా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో ఇచ్చిన మెయిల్ ఐడీ వివరాలతో లాగిన్ రించ్చు. అంతేకాదు... యాపిల్ యూజ‌ర్లు... మొదట్లో ఇచ్చిన యాపిల్ ఐడీతో లాగిన్ అవ్వొచ్చు. ప్ర‌స్తుతం యాపిల్ ఐడీతో కేవ‌లం ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉన్న డివైజ్ ల‌లో మాత్ర‌మే ట్విట్టర్‌కు సైన్ అప్ అయ్యే అవకాశముంది. త్వ‌ర‌లోనే మాక్ ఓఎస్‌లో కూడా ట్విట్ట‌ర్‌తో లాగిన్ అయ్యే ఫీచ‌ర్‌ను తీసుకురానున్నారు. గూగుల్ ఖాతాతో మాత్రం ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ వినియోగదారులు, వెబ్ బ్రౌజ‌ర్ తో లాగిన్ కావచ్చు.

Updated Date - 2021-08-04T02:33:50+05:30 IST