ఆ సిమ్ కార్డులు... పనిచేయవు...

ABN , First Publish Date - 2021-12-09T22:32:22+05:30 IST

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్(డీఓటీ) నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. తొమ్మిదికంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగిన వారి సిమ్‌ కార్డులను రీవెరిఫికేషన్ చేయాలని పేర్కొంది.

ఆ సిమ్ కార్డులు... పనిచేయవు...

న్యూఢిల్లీ : డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్(డీఓటీ) నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. తొమ్మిదికంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగిన వారి సిమ్‌ కార్డులను రీవెరిఫికేషన్ చేయాలని పేర్కొంది. వెరిఫై కాని సిమ్ కార్డులు ఈ క్రమంలో రద్దు కానున్నాయి. సిమ్ కార్డులకు వెరిఫికేషన్ ఉంటుందన్నది తెలిసిన విషయమే. పరిమితికి మించి సిమ్ కార్డులున్నవారు... నచ్చిన సిమ్ కార్డులు యాక్టివ్‌లో ఉంచుకొని మిగిలిన వాటిని రద్దు చేసుకునేలా ఓ ఆప్షన్‌ను ఇస్తారు. ఆర్థిక నేరాలు, ఆటోమేటెడ్ కాల్స్, అభ్యంతరకరమైన కాల్స్, మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించే ఉద్దేశంతో డీఓటీ... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


వినియోగంలో లేని మొబైల్ నెంబర్లనన్నింటినీ... డేటా బేస్ నుంచి తొలగించాలని డాట్ టెల్కోలను ఆదేశించింది. కాగా... కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరు  నెలలో సిమ్ కార్డులకు సంబంధించి కేవైసీ నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ఇప్పుడు సిమ్ కార్డు తీసుకోవడానికి ఎలాంటి ఫారంలనూ భర్తీ చేయాల్సిన  అవసరముండబోదు. అలాగే ప్రిపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్, లేదా... పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్‌కు మారాలన్నా ఇదే వెసులుబాటు వర్తిస్తుంది.

Updated Date - 2021-12-09T22:32:22+05:30 IST