ఈ కంపెనీలను కొనేయండంటోన్న బ్రోకింగ్ & రీసెర్చ్ కంపెనీలు...

ABN , First Publish Date - 2021-05-20T22:06:23+05:30 IST

ప్రస్తుత(2021) ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో... కంపెనీలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయి.

ఈ కంపెనీలను కొనేయండంటోన్న బ్రోకింగ్ & రీసెర్చ్ కంపెనీలు...

ముంబై : ప్రస్తుత(2021) ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో... కంపెనీలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయి. ఏవో కొన్ని కంపెనీలు మాత్రమే నిరాశ పరుచుతుండగా పెద్దసంఖ్యలో ఇతర కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో...  బీఎస్ఈ500‌ లో నిప్పాన్ లైఫ్, దాల్మియా భారత్, కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ సహా కొన్ని కంపెనీలు లాభాల విషయంలో దూసుకెళ్ళాయి. ఏకంగా 600-3900 శాతం మేర నికరలాభాన్నార్జించడం గమనార్హం. ఇక రాబోయే జూన్ క్వార్టర్ కోసం అనలిస్టులు మీడియం టర్మ్‌లో ఈ స్టాక్స్ మంచి ఫలితాలనిస్తాయని భావిస్తున్నారు. ఇక ఇవీ ఆ కంపెనీలు...


నిప్పాన్ లైఫ్... మార్చి క్వార్టర్‌లో 3931శాతం పెరుగుదలతో రూ. 1,66.51కోట్ల నికరలాభాన్నార్జించింది. రాబోయే రోజుల్లో రిటన్ ఆన్ ఈక్విటీ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందని ఫిలిప్ కేపిటల్ అంచనా వేసింది. రూ. 230 కోట్ల టాక్స్ క్రెడిట్ కలిసి రావడం ఓ కారణం. దానిని సరిచేసినా, అడ్జెస్టెడ్ నెట్ ప్రాఫిట్ ఇంకా 5.5 రెట్లు పెరిగినట్లేనని షేర్‌ఖాన్  అభిప్రాయపడింది. 


కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ టార్గెట్ రూ. 470,560,448. నాల్గవ త్రైమాసికంలో 11 రెట్లు లేదంటే 994శాతం నికరలాభం పెరుగుదల నమోదు చేసిన కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్, మొత్తం రూ.197కోట్ల లాభాన్నార్జించింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2021 నాలుగో త్రైమాసికంలో నికరలాభం 984శాతం పెరిగి రూ. 209.13కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో అది కేవలం రూ. 19.28కోట్లు మాత్రమే. ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ అంచనా ప్రకారం స్ట్రాంగ్ ఆపరేటింగ్ పెర్ఫామెన్స్‌తోనే ఇది సాధ్యపడింది. అంచనాలకు తగ్గట్లుగానే రాణించిందని ఏంజెల్ బ్రోకింగ్ పేర్కొంది.  


లిండేఇండియా...

ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతోన్న పదం ఆక్సిజన్. అదే ఆక్సిజన్ రవాణలో లిండే ఇండియా ప్రధమస్థానంలో ఉంది. కంపెనీ టోటల్ ప్రొడక్షన్ రఫ్‌గా రోజుకు ఓ 3వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉంటుంది ఇది గతంలో రోజుకు 300 టన్నులు మాత్రమే..


జిందాల్ స్టీల్ అండ్ వపర్... ఈ కంపెనీ మార్చి క్వార్టర్లో  రూ. 2139.29కోట్ల లాభాన్నార్జించింది. గతేడాది ఇది రూ. 305.62 కోట్లు మాత్రమే అంటే 600 శాతం పెరిగింది.స్ట్రాంగ్ కేపెక్స్ ప్లాన్, స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచనుండటం కంపెనీ షేరులో మంచి రిటన్స్ రావడానికి దోహదపడే అంశాలుగా కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.

Updated Date - 2021-05-20T22:06:23+05:30 IST