అప్పుడు రూ. 10 లక్షలు పెట్టి ఉంటే... ఇప్పుడు రూ. 1.70 కోట్లు ?!

ABN , First Publish Date - 2021-12-15T21:25:30+05:30 IST

ఈక్విటీ మార్కెట్లలో డబ్బు సంపాదన అంత తేలిక కాదన్నది ఒకప్పటి మాట. గత రెండేళ్లుగా మాత్రం... ఇది సాధ్యమేనని రుజువు చేసిన వాళ్ల సంఖ్య భారీగానే ఉంది.

అప్పుడు రూ. 10 లక్షలు పెట్టి ఉంటే... ఇప్పుడు రూ. 1.70 కోట్లు ?!

హైదరాబాద్ : ఈక్విటీ మార్కెట్లలో డబ్బు సంపాదన అంత తేలిక కాదన్నది ఒకప్పటి మాట. గత రెండేళ్లుగా మాత్రం... ఇది సాధ్యమేనని రుజువు చేసిన వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. కాగా... ఈ పది షేర్లలో కనీసం ఒక్క దాంట్లోనైనా పెట్టుబడి పెట్టి ఉంటే... మంచి లాభాలను పొంది ఉండేవాళ్ళం. అంటే... ఐదేళ్ల క్రితం రూ. 10 లక్షలను ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు వాటి విలువ సుమారు రూ. 1.70 కోట్లుగా ఉండేది.  ఆ జాబితాలోని షేర్లలో అదానీ ట్రాన్స్‌మిషన్, దీపక్ నైట్రైట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, తాన్లా ప్లాట్‌ఫార్మ్స్, రుచి సోయా, అల్కైల్ అమైన్స్, వైభవ్ గ్లోబల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, పీ అండ్ జీ హెల్త్, ఎస్కార్ట్స్ వంటి స్టాక్స్ ఉన్నాయి. ఈ జాబితాను.. మోతిలాల్ ఒస్వాల్ ఓ నివేదికలో పొందుపరచింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


అదానీ ట్రాన్స్‌మిషన్... గుజరాత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌మిషన్ సంస్థ. ఈ ఐదేళ్ల కాలంలో సంపదను సాధించగలిగింది. ఈ స్టాక్... 2016-21 మధ్య  వార్షికంగా 93 శాతం లాభాలను(సీఏజీఆర్‌)  అందించగలిగింది. ఆ తర్వాత... దీపక్ నైట్రైట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, తాన్లా ప్లాట్ ఫామ్స్, రుచిసోయా ఉన్నాయి. ఈ ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేటర్స్ కూడా ఏడాదికి 81-93 శాతం లాభాలను పొందాయి. ఇక... 20పీఈ లోపే...అయిదేళ్ల క్రితం ఈ జాబితాలోని ఏడు స్టాక్స్ 20, లేదా... అంతకంటే తక్కువ పీఈ(ప్రైస్ ఎర్నింగ్స్)తో ట్రేడవుతూ ఉండేవి. ఇప్పుడవి మరెన్నో రెట్ల పీఈతో కోట్ అవుతున్న విషయాన్ని పక్కనబెడితే... అయిదేళ్ల క్రితం ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో స్టాక్స్ అందుబాటులో ఉండేవి. క్వాలిటీ స్టాక్స్‌ను తక్కువ ప్రైస్‌లో కొనుగోలు చేసి ఎదురుచూసినపక్షంలో... ఏ స్థాయిలో లాభాలొస్తాయో చెప్పేందుకు... ఇది ఓ  ఉదాహరణ. 


రిలయన్స్ కూడా... 

సాధారణంగా చిన్న స్టాక్స్ మాత్రమే సంపదను కూడగట్టుకుంటాయని, మల్టీబ్యాగర్స్ అవుతాయని భావిస్తూ ఉంటారు. అయితే... అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలనందించింది. గత అయిదేళ్ళ కాలంలో(2016-21 మధ్య) అతిపెద్ద వెల్త్ క్రియేటర్‌గా అవతరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. రూ. 5.16 లక్షల కోట్ల సంపదను 2014-19 మధ్య కాలంలో రూ. 9.7 లక్షల కోట్ల సంపదను సృష్టించగలిగింది. 

Updated Date - 2021-12-15T21:25:30+05:30 IST