తన్లా లాభం రూ.102 కోట్లు

ABN , First Publish Date - 2021-05-20T05:47:32+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి తన్లా ప్లాట్‌ఫారమ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.102.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది

తన్లా లాభం రూ.102 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం చివరి  త్రైమాసికానికి  తన్లా ప్లాట్‌ఫారమ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.102.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.89.12 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు కంపెనీ వెల్లడించింది. త్రైమాసికాదాయం రూ.526 కోట్ల నుంచి రూ.650 కోట్లకు పెరిగింది. మొత్తం ఏడాదికి రూ.2,363.40 కోట్ల ఆదాయంపై రూ.356.13 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. 

Updated Date - 2021-05-20T05:47:32+05:30 IST