ఆ ఇల్లు... ఎంతంటే...

ABN , First Publish Date - 2021-11-05T05:30:00+05:30 IST

ప్రపంచ ధనికుల్లో ఒకరైన, భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తాజాగా లండన్‌లో రూ. 590 కోట్లకు పైగా విలువైన కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు వినవస్తోంది.

ఆ ఇల్లు... ఎంతంటే...

లండన్ : ప్రపంచ ధనికుల్లో ఒకరైన, భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తాజాగా లండన్‌లో రూ. 590 కోట్లకు పైగా విలువైన కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు వినవస్తోంది. ముఖేష్ అంబానీ లండన్‌లోని బకింగ్‌హామ్‌షైర్ స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల్లోని అత్యంత విశాలమైన భవానాన్ని రూ. 592 కోట్లకు కొనుగోలు చేశారని వినవస్తోంది. ఈ ఇంధ్ర భవనంలో 49 బెడ్‌రూంలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే తన కుటుంబంతో ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్నారనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. కరోనా నేపధ్యంలో రెండో ఇంటి అవసరం ఉందని ఈయన భావిస్తున్నట్లు వినస్తోంది. ఈ క్రమంలోనే... సువిశాలంగా ఉండే ఇల్లు  కొనుగోలుకు గతేడాది నుంచే ప్రయత్నాలు  ప్రారంభించారని వినవస్తోంది. కాగా... ఈ విషయమై... రిలయన్స్ స్పందించింది. కొత్త ఇల్లు కొనుగోలు వార్తల్లో నిజం లేదని పేర్కొంది. 

Updated Date - 2021-11-05T05:30:00+05:30 IST